News March 18, 2024

సజావుగా టెన్త్ పరీక్షలను నిర్వహించాలి: కలెక్టర్

image

10వ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.గౌతమి ఆదేశించారు. సోమవారం అనంతపురంలోని మొదటి రోడ్‌లో ఉన్న శ్రీ శారదా నగరపాలక బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు.

Similar News

News July 3, 2024

అనంతపురం జిల్లాలో కేరళ వాసి అబ్దుల్ మృతి

image

డీ.హీరేహల్ మండలంలో కేరళ వాసి అబ్దుల్ ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు ఎస్సై గురుప్రసాద్ రెడ్డి తెలిపారు. బళ్లారి-బెంగళూరు హైవేపై ఓ డాబాలో స్వీపర్‌గా పనిచేస్తున్నాడని, పని ముగించుకుని వెళ్లిన గంట సేపటికే హైవే పక్కన అబ్దుల్ పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించి సమాచారం అందించారని పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

News July 3, 2024

అనంత: బాలికపై అత్యాచారం..

image

ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను యువకుడు అత్యాచారం చేసిన ఘటన పుట్లూరు మండలంలో జరిగింది. ఇంటర్ చదువుతున్న బాలికను ఈ నెల 23న ఇంటి వద్ద నుంచి రవితేజ బైక్‌పై బలవంతంగా తీసుకెళ్లాడు. ఐషర్ వాహనంలో రాత్రంతా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఉదయం బాలిక తప్పించుకుని ఇంటికి చేరుకుంది. షాక్‌లో ఉన్న బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పలేదు. బంధువులు ధైర్యం చెప్పి ఆరా తీయగా విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News July 3, 2024

అనంత: రానున్న 5 రోజుల్లో తేలికపాటి వర్షాలు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయ్ శంకర్, నారాయణ స్వామి తెలిపారు. వచ్చే ఐదు రోజులు ఉష్ణోగ్రతలు పగటి వేళ 35.5 డిగ్రీల నుంచి 36.6 డిగ్రీలుగా, రాత్రి వేళ 25.6 డిగ్రీల నుంచి 26.2 డిగ్రీలుగా నమోదయ్యే సూచనలు ఉన్నాయన్నారు. నైరుతి దిశగా గాలులు గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.