News April 28, 2024

HYDను కేంద్ర పాలిత ప్రాంతం కానివ్వం: కేటీఆర్

image

TG: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయకుండా అడ్డుకుంటామని మాజీ మంత్రి KTR అన్నారు. ‘హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాకుండా, రాజ్యాంగం మార్చకుండా అడ్డుకునే శక్తి BRSకే ఉంది. ఈ ఎన్నికల్లో 12 సీట్లు వస్తే ఏడాదిలోపే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలు శాసిస్తారు. తుంటి విరిగినా, కూతురు జైలు పాలైనా, నమ్మినవారు మోసం చేసి పార్టీ మారినా కేసీఆర్ బెదరలేదు. బస్సుయాత్ర పేరిట జనంలోనే తిరుగుతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News April 16, 2026

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం: కలెక్టర్

image

కలెక్టర్ పి. రాజాబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల పురోగతిపై సమీక్షా సమావేశం జరిగింది. విద్యా ప్రమాణాల పెంపునకు FLN బలోపేతం చేయాలని, PAL ల్యాబ్ ట్యాబ్స్ వినియోగం, క్రమం తప్పకుండా స్లిప్ టెస్టులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, పరిశుభ్రతతో పాటు విద్యార్థులకు పోషకాహారం, ప్రోటీన్ సప్లిమెంట్లు అందించాలని ఆదేశించారు.

News April 16, 2026

పంత్ ఆడటం కష్టమే: మాజీ క్రికెటర్

image

RCBతో జరిగిన మ్యాచులో LSG కెప్టెన్ పంత్‌ ఎడమ మోచేతికి బంతి తగిలి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. అయితే గాయం కారణంగా సీజన్‌లో మిగిలిన మ్యాచులకు పంత్ అందుబాటులో ఉండకపోవచ్చని భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ‘LSG చాలా దారుణమైన జట్టు. వాళ్ల బౌలింగ్ మాత్రమే కాస్త బాగుంది. 5 మ్యాచులు పూర్తయినా బ్యాటింగ్‌లో రాణించేలా కనిపించట్లేదు’ అని తన యూట్యూబ్ ఛానల్‌లో చెప్పుకొచ్చారు.

News April 16, 2026

రిలేషన్‌షిప్, మ్యారేజ్‌కు నా దగ్గర టైమ్ లేదు: మృణాల్

image

రిలేషన్‌షిప్, మ్యారేజ్‌కు ప్రస్తుతం తన వద్ద టైమ్ లేదని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలిపారు. తాను సినిమాలతో బిజీగా ఉన్నానని చెప్పారు. ‘ఈమధ్య నా కాలుకు దెబ్బ తగిలింది. బిజీ షెడ్యూల్ వల్ల ట్రీట్‌మెంట్ చేయించుకోలేకపోయాను. అలాంటిది రిలేషన్‌షిప్‌కు నా దగ్గర టైమ్ ఎక్కడ ఉంటుంది. ఎవరితో డేటింగ్ చేస్తున్నానన్న దానికంటే నేను చేసే పని వల్లే నాకు గుర్తింపు రావాలి’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.