News April 25, 2024
నీటి వృథా అరికట్టేందుకు..

ఎండల తీవ్రత పెరగడంతో నీటి ఎద్దడిని నివారించేందుకు భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వందే భారత్ రైలు ప్రయాణికులకు ప్రస్తుతం ఉచితంగా ఇస్తున్న లీటర్ వాటర్ బాటిల్ స్థానంలో 500 ML బాటిల్‌ను ఇవ్వాలని నిర్ణయించింది. ఒకవేళ ప్రయాణికులు కోరితే మరో ఎక్స్‌ట్రా బాటిల్ ఇవ్వనున్నట్లు తెలిపింది.
Similar News
News July 8, 2025
ఈ లక్షణాలుంటే కఠిక పేదరికమే: చాణక్య నీతి

ఏ ఇంట్లో స్త్రీకి సముచిత స్థానం, తగిన మర్యాద దక్కదో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని చాణక్య నీతి చెబుతోంది. అహంకారం, మోసం చేసే గుణాలున్న వారు మొదట లాభపడవచ్చు. కానీ, వారింట లక్ష్మి నిలవదు. పరిస్థితిని అంచనా వేయకుండా నోటికొచ్చినట్లు మాట్లాడే వ్యాపారి, ఉద్యోగి ఇబ్బందులు పడక తప్పదు. అలాంటి వారికి లక్ష్మీ కటాక్షం ఉండదని చాణక్య నీతిలో ఉంది.
News July 8, 2025
రాష్ట్రంలో రానున్న 3 రోజులు వర్షాలు

AP: పశ్చిమ బెంగాల్ పరిసరాల్లోని అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతోందని IMD తెలిపింది. దీనికి అనుగుణంగా ద్రోణి కూడా కొనసాగుతోంది. రానున్న రెండ్రోజుల్లో అల్పపీడనం ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌వైపు కదులుతుంది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించింది.
News July 8, 2025
మూడ్రోజుల్లో రైతులకు ధాన్యం కొనుగోలు నగదు: మార్క్‌ఫెడ్

AP: రైతులకు మార్క్‌ఫెడ్ ఎండీ ఢిల్లీరావు శుభవార్త చెప్పారు. ‘రాష్ట్ర ప్రభుత్వ హామీతో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(NCDC) నుంచి రూ.వెయ్యి కోట్లు రుణం పొందేందుకు మార్క్‌ఫెడ్‌కు అనుమతి లభించింది. రుణం అందగానే ధాన్యం సేకరించిన పౌర సరఫరాల సంస్థకు నగదు బదిలీ చేస్తాం. తద్వారా పౌర సరఫరాల సంస్థ రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించి నగదు చెల్లింపులు వెనువెంటనే చేస్తుంది’ ఆయన పేర్కొన్నారు.