News August 27, 2024

హాయిగా నిద్ర పోవాలంటే..

image

సరైన ఆహారం, నిద్ర ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఆకుకూరలు, కివీ పండ్లు, చెర్రీలు, ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలు తింటే హాయిగా నిద్రపోతారని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిపూట వేపుళ్లు, పాస్తా, ప్రాసెస్డ్ ఫుడ్ తినొద్దని, ఆల్కహాల్, కెఫిన్ లాంటి పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. పాప్, ర్యాప్, టెంపో, స్లో బీట్ వంటి మ్యూజిక్ ట్రాక్‌లు కూడా మంచి నిద్ర పట్టేలా చేస్తాయి.
SHARE IT

Similar News

News September 12, 2024

‘కాంచన 4’లో పూజా హెగ్డే?

image

హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ తెరకెక్కించనున్న ‘కాంచన 4’ మూవీలో పూజా హెగ్డే నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను మేకర్స్ సంప్రదించగా ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా కాంచన సిరీస్‌లో ఇప్పటికే ముని, కాంచన 2, గంగా చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం తెరకెక్కబోయే కాంచన 4ను రూ.100 కోట్ల బడ్జెట్‌తో గోల్డ్ మైన్ మూవీస్ రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

News September 12, 2024

శరవేగంగా వారణాసి స్టేడియం పనులు

image

వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రూ.441 కోట్ల అంచనా వ్యయంతో ఈ మైదానాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో 7 పిచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. 30 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యంతో అత్యాధునిక సౌకర్యాలతో దీనిని నిర్మిస్తున్నారు. ఢమరుకం, త్రిశూలం ఆకారాలతో అడుగడుగునా శివతత్వం ఉట్టిపడేలా BCCI, UPCA దీనిని నిర్మిస్తున్నాయి.

News September 12, 2024

YCP MP మిథున్ రెడ్డి బర్త్ డే వేడుకల్లో ఉద్రిక్తత

image

AP: రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఉద్రిక్తత నెలకొంది. చిత్తూరు జిల్లా సదుం మండలం పెద్దూరులో జరిగిన ఎంపీ బర్త్ డే వేడుకల సందర్భంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఇరువర్గాలు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నాయి. ఈ గొడవలో పలువురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.