News June 2, 2024
అరుణాచల్ ప్రజలు పట్టం కట్టేదెవరికో?

అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పుపై ఆసక్తి నెలకొంది. ప్రత్యర్థులు లేక BJP ఇప్పటికే పది చోట్ల విజేతగా నిలిచింది. నేడు వెల్లడికానున్న మిగిలిన 50 స్థానాల ఫలితాలపైనా BJP ధీమాగా ఉంది. మరోవైపు నేషనల్ పీపుల్స్ పార్టీతో కలిసి బరిలోకి దిగిన కాంగ్రెస్ 19 సీట్లలోనే పోటీకి పరిమితమైంది. పేపర్ లీక్స్‌తో ప్రభుత్వంపై వ్యతిరేకత, తమ పార్టీ ప్రకటించిన గ్యారంటీలు కలిసి వస్తాయనేది కాంగ్రెస్ అంచనా.
Similar News
News February 3, 2026
13న ఓటీటీలోకి రవితేజ సినిమా?

రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయినట్లు సమాచారం. ఈ నెల 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ట్రయాంగిల్ లవ్&కామెడీ డ్రామాతో రూపొందిన ఈ చిత్రంలో డింపుల్ హయాతి, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. జనవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది.
News February 3, 2026
U19 WC.. ఫైనల్లోకి దూసుకెళ్లిన ఇంగ్లండ్

ఐసీసీ U19 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 27 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. తొలుత ENG 277/7 స్కోర్ చేయగా ఆసీస్ 47.3 ఓవర్లలో 250 పరుగులకే ఆలౌటైంది. రేపు రెండో సెమీస్‌లో ఇండియా, అఫ్గాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది.
News February 3, 2026
42% సీట్లు ఏవి?: పార్టీలకు BCల సెగ

TG: మున్సి‘పోల్స్’లో నామినేషన్లు ముగిశాయి. చాలా చోట్ల పార్టీ టికెట్ల కోసం గొడవలు జరిగాయి. స్థానిక సంస్థల్లో BCలకు 42% సీట్లు ఇస్తామన్న INC, BRS, BJPకి వారి నుంచి అసంతృప్తి సెగ గట్టిగానే ఉంది. అధికారిక 32% రిజర్వేషన్ సీట్లు సహా మిగతా వాటిని పార్టీ పరంగా ఇస్తామన్నాయి. ఇప్పుడేమో చేతులెత్తేశాయి. దీంతో BCల నుంచి నిరసన వస్తుండడంతో పార్టీలకు దిక్కుతోచడం లేదు. ప్రచారాల్లో ఏం చెప్పాలోనని తల పట్టుకున్నాయి.


