News October 8, 2025
నేడు..

☕TG: BCలకు 42% రిజర్వేషన్ల G.O.పై హైకోర్టులో విచారణ
☕AP: లిక్కర్ కేసు నిందితులు కసిరెడ్డి, బాలాజీ బెయిల్ పిటిషన్లపై కోర్టులో విచారణ
☕AP: డిమాండ్ల సాధనకై PHC డాక్టర్ల దీక్ష
☕AP: పిన్నెల్లి సోదరులకు ముగియనున్న SC మధ్యంతర బెయిల్
☕ మెదక్ జిల్లాలో పంటనష్ట ప్రాంతాల్లో కేంద్రబృందం పర్యటన
☕WWC: 3PMకు ఆస్ట్రేలియా Vs పాక్ మ్యాచ్
☕క్లచ్ చెస్ టోర్నీలో విశ్వనాథన్ ఆనంద్-గ్యారీ కాస్పరోవ్ ఢీ
Similar News
News October 8, 2025
BRIC -NABIలో ఉద్యోగాలు

BRIC-నేషనల్ అగ్రి ఫుడ్ అండ్ బయో మాన్యుఫాక్చరింగ్ ఇన్‌స్టిట్యూట్ 6 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. సైంటిస్ట్ F, అసోసియేట్ ప్లాంట్ మేనేజర్, సైంటిస్ట్ C, మేనేజ్‌మెంట్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, PhD, ఎంటెక్/ఎంఈ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: http://ciab.res.in/
News October 8, 2025
ALERT.. ‘కాపీ పేస్ట్’ చేస్తున్నారా?

టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. అట్రాక్ట్ చేసే కంటెంట్, టెక్ట్స్ మెసేజ్‌లతో యూజర్లను మాయచేస్తున్నారు. పాపప్స్ నమ్మి కంటెంట్ కాపీ పేస్ట్ చేస్తే ఫోన్లు, కంప్యూటర్లలోకి మాల్‌వేర్‌ను పంపుతున్నారు. దీంతో డివైస్‌లు హ్యాక్ చేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎప్పటికప్పుడు డివైస్ అప్డేట్ చేయడంతో పాటు అనవసరమైన లింక్స్ క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు. SHARE
News October 8, 2025
మీరు వద్దనుకున్నవి.. వారికి సంతోషాన్నిస్తాయి!

దీపావళి సందర్భంగా అందరూ ఇళ్లు శుభ్రం చేసుకుంటూ పాత వస్తువులను బయట పారేస్తుంటారు. అయితే పనికొచ్చే వస్తువులను, దుస్తులను పడేసే ముందు ఓసారి ఆలోచించండి. మీరు వద్దనుకునే ఆ వస్తువులు ఎంతోమందికి ఉపయోగపడొచ్చు. బట్టలు, పుస్తకాలు, ఆట బొమ్మలు, వంట సామగ్రి, పాదరక్షలు, ఎలక్ట్రానిక్స్ మొదలైన వస్తువులను అవసరమైన వాళ్లకు ఇచ్చేందుకు ముందుకురండి. చాలా NGOలు, శరణాలయాలు వీటిని స్వీకరిస్తాయి. SHARE IT