News September 10, 2024

నేడు మరో రూ.1,500 కోట్ల అప్పు

image

TG: రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1,500 కోట్లు RBI నుంచి అప్పుల రూపంలో సమీకరించుకోనుంది. ఈ మొత్తాన్ని బాండ్ల వేలం ద్వారా తీసుకుంటుంది. ఈ నెల 3న రూ.1,000 కోట్లు అప్పు తీసుకున్న ప్రభుత్వం మరోమారు రుణం తీసుకునేందుకు సిద్ధమైంది. ఆగస్టులోనూ రూ.6వేల కోట్లు రెండు విడతలుగా తీసుకుంది. జులైలో రూ.7వేల కోట్లు సమకూర్చుకుంది.

Similar News

News October 7, 2024

ఈ సినిమాలో నా క్యారెక్టర్ చూసి షాకవుతారు: శ్రీకాంత్

image

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ పక్కా కమర్షియల్ సినిమా అని నటుడు శ్రీకాంత్ అన్నారు. చరణ్‌తో తనకు ముందు నుంచే ర్యాపో ఉందని చెప్పారు. శంకర్ సినిమాలో నటించే అవకాశం రావడం గొప్ప విషయమన్నారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చూసి అభిమానులు షాకవుతారన్నారు. కాగా శ్రీకాంత్ నటించిన ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.

News October 7, 2024

మళ్లీ పుట్టినట్లుగా ఉంది: వరుణ్ చక్రవర్తి

image

మూడేళ్ల తర్వాత టీమ్ ఇండియా తరఫున ఆడటం మళ్లీ పుట్టినట్లుగా ఉందని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అన్నారు. ఇది తనకు ఎమోషనల్ మూమెంట్ అని పేర్కొన్నారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ప్రదర్శన కాన్ఫిడెన్స్‌ను పెంచిందని వరుణ్ చెప్పారు. ఈ ప్రదర్శనను కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా బంగ్లాతో తొలి టీ20లో వరుణ్ మూడు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.

News October 7, 2024

అక్టోబర్ 7: చరిత్రలో ఈరోజు

image

1708: సిక్కుల చివరి గురువు గురు గోవింద సింగ్ మరణం
1885: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత నీల్స్ బోర్ జననం
1900: తెలుగు భాషా శాస్త్రవేత్త, కవి, కులపతి గంటి జోగి సోమయాజి జననం
1940: పండితులు, కవి, రచయిత కూచి నరసింహం మరణం
1979: మిస్ వరల్డ్ (1999), నటి యుక్తా ముఖీ జననం