News September 20, 2024

TODAY HEAD LINES

image

➢ ఆ 3 కుటుంబాలు క‌శ్మీర్‌ను దోచుకున్నాయి: మోదీ
➢ AP: పవిత్ర తిరుమలను అపవిత్రం చేశారు: బాబు
➢ AP: వరద బాధితులకు అదానీ రూ.25 కోట్ల సాయం
➢ TG: MSMEలు భాగస్వామిగా ఉండాలి: CM
➢ AP: పవన్‌తో బాలినేని, సామినేని భేటీ
➢ AP: తిరుపతి లడ్డూ తయారీలో ఎద్దు కొవ్వు, చేప నూనె: NDDB రిపోర్టు
➢ TG: పోలీసుల అదుపులో జానీ మాస్టర్
➢ అశ్విన్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్

Similar News

News July 9, 2025

MIM నేతల పట్ల మెతక వైఖరి లేదు: హైడ్రా

image

TG: తాము ఎంఐఎం నేతల పట్ల ఎలాంటి మెతక వైఖరిని అవలంబించట్లేదని హైడ్రా స్పష్టం చేసింది. హైడ్రా మొదటి కూల్చివేత ఎంఐఎం నేతలకు సంబంధించిన ఆక్రమణలేనని పేర్కొంది. ఇటీవల కూల్చివేతల్లోనూ HYD చాంద్రాయణగుట్టలోని MIM కార్పోరేటర్లకు చెందిన దుకాణాలను తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. తాము పారదర్శకంగా పనిచేస్తున్నామని తెలిపింది. సామాజిక కారణాలతో <<16969545>>ఫాతిమా కాలేజీ<<>> కూల్చివేతను నిలిపివేశామంది.

News July 9, 2025

విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. ABVP ప్రస్థానమిదే!

image

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) 77వ వసంతంలోకి అడుగు పెట్టింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) విద్యార్థి విభాగమైన ఈ సంస్థను 1949 జులై 9న ఏర్పాటు చేశారు. ఆవిర్భావ దినోత్సవాన్ని ‘రాష్ట్రీయ ఛత్ర దివస్’ (జాతీయ విద్యార్థి దినోత్సవం)గా కార్యకర్తలు నిర్వహిస్తుంటారు. విద్యార్థులలో జాతీయవాద భావనను పెంపొందించడం, విద్యా సంస్కరణలను ప్రోత్సహించడం, విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా ABVP పనిచేస్తోంది.

News July 9, 2025

5 రోజుల్లో ‘తమ్ముడు’ షేర్ ఎంతంటే?

image

నితిన్ నటించిన ‘తమ్ముడు’ థియేటర్లలో ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. విడుదలైన 5 రోజుల్లో రూ.3 కోట్ల షేర్ మాత్రమే రాబట్టినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. రూ.75 కోట్లతో తెరకెక్కిస్తే థియేట్రికల్ హక్కులు రూ.25 కోట్లకు అమ్ముడుపోగా 12శాతమే రికవరీ అయినట్లు తెలిపాయి. దారుణమైన డిజాస్టర్ అని అభివర్ణించాయి. అంతకుముందు ‘రాబిన్ హుడ్’ కూడా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.