News November 28, 2024
TODAY HEAD LINES
* ఇసుక లభ్యత పెంచండి: చంద్రబాబు
* గంజాయి విక్రయించే కుటుంబాలకు పథకాలు కట్: లోకేశ్
* ఈ నెల 30 నుంచి బీఆర్ఎస్ గురుకులాల బాట
* తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌తో విసిగిపోయారు: మోదీ
* ఐసీసీ ర్యాంకింగ్స్: అగ్ర స్థానంలో బుమ్రా
* మతం మార్చుకుంటే రిజర్వేషన్లు వర్తించవు: సుప్రీంకోర్టు
* ధనుష్-ఐశ్వర్యకు విడాకులు మంజూరు
Similar News
News December 4, 2024
వియత్నాంలో విచిత్ర ట్రెండ్.. అద్దెకు బాయ్‌ఫ్రెండ్స్!
వియత్నాంలో ఓ విచిత్రమైన ట్రెండ్ ఊపందుకుంది. పెళ్లి విషయంలో పేరెంట్స్, చుట్టాల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకునేందుకు అక్కడి అమ్మాయిులు బాయ్‌ఫ్రెండ్స్‌ను అద్దెకు నియమించుకుంటున్నారు. పెళ్లెప్పుడు అని ఎవరైనా అడిగితే చాలు.. వెంటనే అద్దె ప్రియుడిని చూపించి ఆల్రెడీ లవ్‌లో ఉన్నా అని కవర్ చేస్తున్నారు. ఈ ట్రెండ్‌ను సొమ్ము చేసుకునేందుకు అబ్బాయిల్ని సరఫరా చేసే సంస్థలు కూడా అక్కడ పుట్టుకురావడం ఆసక్తికరం.
News December 4, 2024
చై-శోభిత పెళ్లికి తరలివచ్చిన సెలబ్రిటీలు
అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్య-శోభిత వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, రానా, అడవి శేష్, కీరవాణి, టి.సుబ్బరామిరెడ్డి, చాముండేశ్వరీనాథ్, సుహాసిని, అశోక్ గల్లా, చందూ మొండేటి తదితరులు హాజరయ్యారు. అలాగే అక్కినేని ఫ్యామిలీ, సన్నిహితులు, బంధువులు పాల్గొన్నారు.
News December 4, 2024
బుర్రా వెంకటేశం వీఆర్ఎస్‌కు ఆమోదం
TG: ఐఏఎస్ బుర్రా వెంకటేశం స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్)కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరో మూడున్నరేళ్ల పదవీకాలం ఉండగానే ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు. ఇప్పటివరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న వెంకటేశంను ఇటీవల టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన రేపు ఆ బాధ్యతలు చేపట్టనున్నారు.