News September 14, 2024

TODAY HEADLINES

image

✒ కేజ్రీవాల్‌కు బెయిల్.. జైలు నుంచి విడుదల
✒ ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత
✒ పోర్ట్‌బ్లెయిర్ పేరు ‘శ్రీ విజయపురం’గా మార్పు
✒ ఏచూరి భౌతికకాయానికి CBN నివాళి
✒ పవన్ సినిమా ఆర్టిస్ట్.. CBN డ్రామా ఆర్టిస్ట్: జగన్
✒ ‘హైడ్రా’ తీరుపై హైకోర్టు అసంతృప్తి
✒ శాంతి భద్రతలకు విఘాతం కలగొద్దు.. డీజీపీకి CM రేవంత్ ఆదేశం
✒ కౌశిక్VSగాంధీ వివాదానికి రేవంతే కారణం: హరీశ్
✒ వరదలకు రూ.10,032 కోట్ల నష్టం: సీఎం రేవంత్

Similar News

News November 18, 2025

కోర్టులు, విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు

image

ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. పటియాలా హౌస్, సాకేత్, రోహిణి కోర్టులతోపాటు పలు స్కూళ్లు, కాలేజీల్లో బాంబులు పెట్టినట్లు దుండగులు మెయిల్స్ చేశారు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్స్‌తో తనిఖీలు చేస్తున్నాయి. ముందుజాగ్రత్తగా కోర్టులు, విద్యాసంస్థల్లో సిబ్బందిని, విద్యార్థులను బయటకు పంపించాయి. కాగా ఇటీవల ఎర్రకోట దగ్గర ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే.

బంధాలు చెడిపోగానే రేప్ కేసులు పెడుతున్నారు: మద్రాస్ హైకోర్టు

image

విఫలమైన ప్రతి బంధాన్ని నేరంగా పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు (మదురై బెంచ్) వ్యాఖ్యానించింది. బంధాలు చెడిపోగానే రేప్ కేసులు పెట్టడం సరికాదంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి దేవా విజయ్(తిరునెల్వేలి) తనతో 9ఏళ్లు లైంగిక సంబంధంలో ఉన్నాడని, మోసం చేశాడని ఓ యువతి రేప్ కేసు పెట్టింది. దీనిపై విజయ్ కోర్టును ఆశ్రయించాడు. విచారించిన కోర్టు యువతిని మోసం చేశాడనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కేసును కొట్టివేసింది.