News November 2, 2024
TODAY HEADLINES
* AP: దీపం-2 పథకం ప్రారంభం
* త్వరలో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు: చంద్రబాబు
* షర్మిలకు రక్షణ కల్పిస్తాం: పవన్
* రెడ్ బుక్ విషయంలో తగ్గేదే లేదు: లోకేశ్
* TG: విద్యార్థులకు కొత్త డైట్ ప్లాన్: రేవంత్
* TG: కులగణన.. మధ్యాహ్నం ఒంటి గంట వరకే స్కూళ్లు
* రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా: కేటీఆర్
* ముగిసిన తొలి రోజు ఆట.. కీలక వికెట్లు కోల్పోయిన భారత్
Similar News
News December 9, 2024
STOCK MARKETS: ఎలా మొదలవ్వొచ్చంటే..
స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆసియాలో జపాన్, తైవాన్ మినహా అన్ని దేశాల సూచీలు ఎరుపెక్కాయి. గిఫ్ట్ నిఫ్టీ 8 పాయింట్లే పెరగడం అనిశ్చితిని సూచిస్తోంది. సిరియా సంక్షోభం, ముడి చమురు ధరలు స్థిరంగానే ఉండటం, ఒపెక్ ప్లస్ దేశాలు చమురు ఉత్పత్తి, ధరలపై నిర్ణయం తీసుకోకపోవడం వంటివి గమనించాల్సిన అంశాలు. క్రితంవారం జోరు ప్రదర్శించిన నిఫ్టీ, సెన్సెక్స్ ఈవారం మిశ్రమంగా ఉండొచ్చు.
News December 9, 2024
శ్రీవారి దర్శనానికి 6 గంటల టైమ్
AP: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఒక కంపార్ట్‌మెంటులో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఏడుకొండలవాడిని 73,107 మంది దర్శించుకున్నారు. 22,721 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు లభించింది.
News December 9, 2024
దారుణం.. యువతిని తగలబెట్టిన ప్రేమోన్మాది
AP: నంద్యాల(D) నందికొట్కూరు బైరెడ్డి నగర్‌లో దారుణం జరిగింది. ఇంటర్ విద్యార్థిని లహరిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం అతడు కూడా నిప్పటించుకోగా, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. తన ప్రేమను ఒప్పుకోలేదన్న కోపంతో యువతిపై యువకుడు దాడి చేసినట్లు సమాచారం.