News November 20, 2024

TODAY HEADLINES

image

✒ రష్యాపై తొలిసారి US మిస్సైల్స్‌తో ఉక్రెయిన్ దాడి
✒ ‘మణిపుర్’పై జోక్యం చేసుకోండి.. రాష్ట్రపతికి INC వినతి
✒ AP: రాష్ట్ర రోడ్లపైనా టోల్ యోచన: CBN
✒ AP: రూ.85,000cr పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
✒ AP: ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు: రజిని
✒ TG: కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ GOను కొట్టేసిన హైకోర్టు
✒ TG: KCR తాగుబోతుల సంఘం అధ్యక్షుడు: రేవంత్
✒ TG: చేవలేనోనికి బూతులెక్కువ.. CMపై హరీశ్ ఫైర్

Similar News

News December 10, 2024

మోదీని పడగొట్టాలన్న సొరోస్ వైఖరికే కట్టుబడ్డారా: USకు BJP ప్రశ్న

image

మోదీ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న జార్జ్ సొరోస్ వైఖరికే కట్టుబడ్డారో లేదో చెప్పాలని అమెరికాను BJP డిమాండ్ చేసింది. భారత్‌పై విషం చిమ్ముతున్న OCCRP మీడియా సంస్థకు సొరోస్‌తో పాటు US డీప్‌స్టేట్ ఫండింగ్ ఇవ్వడాన్ని గుర్తుచేసింది. వీటితో చేతులు కలిపే రాహుల్ గాంధీ భారత ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని ఆరోపించింది. OCCRP కొందరి ఒత్తిడితో తప్పుడు రాతలు రాస్తోందని ఫ్రెంచ్ జర్నలిస్టు బయటపెట్టారని తెలిపింది.

News December 10, 2024

ఓటీటీలోకి వచ్చేసిన ‘తంగలాన్’

image

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన ‘తంగలాన్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రసారమవుతోంది. పా.రంజిత్ తెరకెక్కించిన ఈ మూవీలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటించారు. కాగా ఈ సినిమా ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టినట్లు టాక్.

News December 10, 2024

ఈ ఇంటి కోసమే మంచు కుటుంబంలో మంటలు?

image

సినీ నటుడు మోహన్ బాబు తన శేషజీవితం ప్రశాంతంగా గడిపేందుకు శంషాబాద్ సమీపంలోని జల్‌పల్లిలో విశాలమైన ఇల్లు కట్టుకున్నారు. ఇందులో గార్డెన్, స్విమ్మింగ్‌పూల్, సిబ్బంది గదులతోపాటు సకల సౌకర్యాలతో నిర్మించారు. ప్రస్తుతం ఈ ఇంటి విలువ రూ.కోట్లలో ఉంటుంది. ఫిల్మ్ నగర్‌లో ఉండే ఇల్లు లక్ష్మీ ప్రసన్నకు ఇచ్చేశారు. ఇప్పుడు జల్‌పల్లి నివాసాన్ని స్వాధీనం చేసుకునేందుకు మంచు మనోజ్ ప్రయత్నిస్తున్నారన్నది ఆరోపణ.