News November 30, 2024

TODAY HEADLINES

image

* AP: కాకినాడ పోర్టును సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్
* TG: లగచర్ల భూసేకరణ రద్దు చేసుకున్న ప్రభుత్వం
* AP: రిషితేశ్వరి కేసు కొట్టేసిన గుంటూరు కోర్టు
* TG: 10th ఇంటర్నల్ పరీక్షల ఎత్తివేత నిర్ణయం వాయిదా
* ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో నిరుపేదలకు తొలి ప్రాధాన్యం: CM రేవంత్
* AP: సంక్రాంతి నుంచి జగన్ జిల్లాల పర్యటన
* TG: రాష్ట్రవ్యాప్తంగా BRS దీక్ష దివస్
* First Time: జట్టులోని 11 మంది బౌలింగ్

Similar News

News December 10, 2024

రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ తొల‌గింపు నిబంధ‌న‌లు ఇవే

image

రాజ్య‌స‌భ ఛైర్మ‌న్‌పై విప‌క్షాలు ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే ఓటింగ్ సంద‌ర్భంగా ఆ రోజు స‌భ‌కు హాజ‌రైన‌వారిలో సగం కంటే ఎక్కువ మంది మ‌ద్ద‌తు అవ‌స‌రం. రాజ్య‌స‌భ ఆమోదం అనంత‌రం ఇదే తీర్మానం లోక్‌స‌భలో సాధార‌ణ మెజారిటీతో నెగ్గాలి. ఈ ప్ర‌క్రియ అంతా కూడా Article 67(b), 92, 100 ద్వారా జ‌రుగుతుంది. విప‌క్షాల‌కు బ‌లం లేక‌పోవ‌డంతో రాజ్య‌స‌భ‌లో తీర్మానం నెగ్గే ప‌రిస్థితి లేదు.

News December 10, 2024

చలికాలంలో ఈ జ్యూస్ తాగితే…

image

ఆరోగ్య పరిరక్షణలో ఉసిరిని మించింది లేదని ఆయుర్వేదం చెబుతోంది. పరగడపున దీని జ్యూస్ తాగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చలికాలంలో రెగ్యులర్‌గా తీసుకుంటే జబ్బు పడకుండా కాపాడుతుంది. మెటబాలిజాన్ని మెరుగుపరిచి బరువు తగ్గేందుకు సాయపడుతుంది. ఇందులోని విటమిన్-సి బోలెడంత ఇమ్యూనిటీని ఇస్తుంది. ఉదర సమస్యలు తొలగించి మలబద్ధకాన్ని తరిమేస్తుంది. కాలేయ, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్ట్రెస్‌నూ తొలగిస్తుంది.

News December 10, 2024

HIGH ALERT.. భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు AP విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది వచ్చే 24 గంటల్లో శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు కదులుతుందంది. దీని ప్రభావంతో రేపు NLR, అన్నమయ్య, CTR, TPTY, ELR, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది. ఎల్లుండి నుంచి NLR, ATP, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, TPTY జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది.