News December 7, 2024

TODAY HEADLINES

image

☛ TGలో కొత్తగా 7 నవోదయ, APలో 8 కేంద్రీయ విద్యాలయాలు
☛ ట్రాన్స్ జెండర్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు: సీఎం రేవంత్
☛ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరణ
☛ నాలెడ్జ్ హబ్‌గా ఏపీ: సీఎం చంద్రబాబు
☛ ఏపీకి పవన్ నాయకత్వం వహించాలి: VSR
☛ రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు: అల్లు అర్జున్
☛ పుష్ప-2 తొలి రోజు వసూళ్లు రూ.294 కోట్లు
☛ రెండో టెస్టు: తొలి రోజు IND 180కి ఆలౌట్, AUS 86/1

Similar News

News January 22, 2025

BJPకి కటీఫ్ చెప్పిన నితీశ్.. ట్విస్ట్ ఏంటంటే!

image

బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ బీజేపీకి షాకిచ్చారు. మణిపుర్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. అక్కడ ఆ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే 5 స్థానాలున్న NPP సైతం మద్దతు వెనక్కి తీసుకుంది. 60 స్థానాలున్న మణిపుర్ అసెంబ్లీలో ప్రస్తుతం NDA బలం 45కు తగ్గింది. ఇక్కడ బీజేపీకి సొంతంగా 37 సీట్లు ఉన్నాయి. అధికారానికి 31 చాలు.

News January 22, 2025

నోటిఫికేషన్ వచ్చేసింది..

image

UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) నోటిఫికేషన్ రిలీజైంది. 979 పోస్టుల భర్తీకి జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు. మే 25న ప్రిలిమ్స్ జరగనుంది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు, 21-32 ఏళ్ల వయసు ఉన్నవారు దీనికి అర్హులు. దరఖాస్తు చేసుకునేందుకు సైట్: <>https://upsconline.gov.in<<>>

News January 22, 2025

అమరావతికి హడ్కో రూ.11వేల కోట్ల నిధులు: మంత్రి నారాయణ

image

AP: రాజధాని అమరావతి నిర్మాణం కోసం హడ్కో రూ.11వేల కోట్ల నిధులు విడుదల చేసేందుకు అంగీకరించిందని మంత్రి నారాయణ తెలిపారు. ముంబైలో జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. హడ్కో ద్వారా రూ.11వేల కోట్ల రుణం పొందేందుకు చర్చలు జరిపామన్నారు. దీంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని నారాయణ పేర్కొన్నారు.