News January 6, 2025
TODAY HEADLINES
* తెలుగు రాష్ట్రాలు ప్రపంచంతో పోటీ పడాలి: CM రేవంత్
* హైందవ శంఖారావంలో VHP డిక్లరేషన్
* పవన్ కళ్యాణ్ ఈజ్ మై అచీవ్మెంట్: చిరంజీవి
* తెలంగాణలో సంక్రాంతికి వారం రోజులు సెలవులు
* సంక్రాంతికి SCR 52 ప్రత్యేక రైళ్లు
* విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు: మంత్రి లోకేశ్
* కేసీఆర్ రైతు బంధువు.. రేవంత్ రాబంధు: కేటీఆర్
* చిక్కడపల్లి PSలో హాజరైన అల్లు అర్జున్
* 1-3 తేడాతో BGT సిరీస్ కోల్పోయిన భారత్
Similar News
News January 7, 2025
ఫార్ములా-ఈ రేసు కేసు.. సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్
TG: ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కేటీఆర్ సుప్రీంకోర్టును <<15086612>>ఆశ్రయిస్తే<<>> తమ వాదనలు కూడా వినాలంటూ కోరింది.
News January 7, 2025
ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు సిరాజ్కు రెస్ట్!
ఇంగ్లండ్తో జరగనున్న టీ20 సిరీస్కు పేసర్ సిరాజ్కు రెస్ట్ ఇవ్వాలని BCCI భావిస్తోంది. 2023 నుంచి 671.5 ఓవర్ల బౌలింగ్ వేసిన అతనిపై పనిభారం తగ్గించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే T20లకు రెస్ట్ ఇచ్చి వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. BGTలో ఆశించిన మేర రాణించకలేకపోయినా కీలక సమయాల్లో సిరాజ్ వికెట్లు తీశారు. JAN 22-FEB 2వరకు 5 T20లు జరగనున్నాయి.
News January 7, 2025
విద్యుత్ ఛార్జీలు తగ్గబోతున్నాయి: మంత్రి అచ్చెన్న
AP: విశాఖ పర్యటనలో PM మోదీ శంకుస్థాపన చేయనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్తో త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. YCP హయాంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని మోదీ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికైన రైల్వేజోన్కు రేపు PM శంకుస్థాపన చేస్తారన్నారు. అటు హోంమంత్రి అనిత కూడా సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు.