News January 6, 2025

TODAY HEADLINES

image

* తెలుగు రాష్ట్రాలు ప్రపంచంతో పోటీ పడాలి: CM రేవంత్
* హైందవ శంఖారావంలో VHP డిక్లరేషన్
* పవన్ కళ్యాణ్ ఈజ్ మై అచీవ్‌మెంట్: చిరంజీవి
* తెలంగాణలో సంక్రాంతికి వారం రోజులు సెలవులు
* సంక్రాంతికి SCR 52 ప్రత్యేక రైళ్లు
* విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు: మంత్రి లోకేశ్
* కేసీఆర్ రైతు బంధువు.. రేవంత్ రాబంధు: కేటీఆర్
* చిక్కడపల్లి PSలో హాజరైన అల్లు అర్జున్
* 1-3 తేడాతో BGT సిరీస్ కోల్పోయిన భారత్

Similar News

News January 17, 2025

సైఫ్ ఇంట్లో సెక్యూరిటీ, సీసీ కెమెరాలు లేవు: పోలీసులు

image

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ఇంట్లో CCTV కెమెరాలు లేకపోవడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని ముంబై పోలీసులు వెల్లడించారు. విజిటర్స్‌ను చెక్ చేసేందుకు, ఎమర్జెన్సీ సమయంలో వెంటనే స్పందించేందుకు వారి ఫ్లాట్ ముందు పర్సనల్ గార్డ్స్ కూడా లేరని తెలిపారు. ఆ బిల్డింగ్‌కు వచ్చే వారి వివరాలు నమోదు చేసేందుకు లాగ్ బుక్ కూడా లేదని చెప్పారు. సెలబ్రిటీలు సెక్యూరిటీ పెట్టుకోకపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.

News January 17, 2025

ఈ నెలలోనే ఇన్ఫోసిస్ ఉద్యోగుల జీతాల పెంపు!

image

దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు జీతాలు పెంచనున్నట్లు ‘మనీకంట్రోల్’ తెలిపింది. జనవరి 2025 నుంచి వార్షిక వేతనాలు 6-8 శాతం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత మళ్లీ APRలో జీతాల పెంపు ఉండే అవకాశం ఉంది. కాగా, డిసెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ రూ.6,806 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ప్రస్తుతం అందులో 3.23 లక్షల ఉద్యోగులు ఉన్నారు.

News January 17, 2025

మంచు మనోజ్ దంపతులపై కేసు నమోదు

image

AP: మంచు మనోజ్, ఆయన సతీమణి మౌనికపై చంద్రగిరి పీఎస్‌లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా MBUలోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించారని మోహన్ బాబు పీఏ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వారితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. మరోవైపు తమపై దాడి చేశారని మంచు మనోజ్ ఫిర్యాదు చేయడంతో మోహన్ బాబు పీఏతో పాటు మరో 8 మంది సిబ్బందిపై కేసు నమోదైంది.