News March 7, 2025

TODAY HEADLINES

image

☛ తెలుగు ప్రజలకు రుణపడి ఉంటాను: చంద్రబాబు
☛ APకి ఏ లోటు లేకుండా చూస్తాం: నిర్మల
☛ బ్యాలెట్‌ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్‌ చేయాలి: జగన్
☛ SC వర్గీకరణ ముసాయిదా బిల్లుకు TG క్యాబినెట్ ఆమోదం
☛ రేవంత్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ BJPదే గెలుపు: KTR
☛ TG: ఈనెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
☛ UKలో విదేశాంగ మంత్రి జైశంకర్‌పై దాడికి యత్నం
☛ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సునీల్ ఛెత్రి

Similar News

News March 20, 2025

ఉప్పల్ స్టేడియానికి రాజీవ్ గాంధీ పేరు ఎందుకు? : కామెంటేటర్

image

ఉప్పల్ స్టేడియానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టడంతో పాటు అక్కడ ఆయన విగ్రహం ఏర్పాటు చేయడంపై క్రికెట్ కామెంటేటర్ వెంకటేశ్ ప్రశ్నించారు. ‘హైదరాబాద్ క్రికెట్‌కు రాజీవ్ గాంధీకి ఏమిటి సంబంధం? HYD క్రికెట్‌కు వన్నె తెచ్చిన అబిద్ అలీ, ML జయసింహ లాంటి వారి విగ్రహాలు పెడితే బాగుండేది’ అని డిమాండ్ చేశారు. అరుణ్ జైట్లీ, నరేంద్ర మోదీ స్టేడియంలపై నెటిజన్లు ప్రశ్నించగా వాటిని కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

News March 20, 2025

భారీ ఎన్‌కౌంటర్: 30కి చేరిన మృతుల సంఖ్య

image

ఛత్తీస్‌గఢ్‌లోని అండ్రీ అడవుల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 30 మంది నక్సలైట్లు మరణించారు. ఈ పోరులో డీఆర్‌జీ జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది, కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు మరణించారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News March 20, 2025

మాలా ఉద్యోగాలిచ్చిన రాష్ట్రమేదైనా ఉందా?: సీఎం రేవంత్

image

TG: తమ ప్రజాపాలనలో 10 నెలల్లోనే 59వేల ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్ అన్నారు. ‘నేను సవాల్ చేస్తున్నా. ఉమ్మడి రాష్ట్రంలోకానీ, ప్రధాని మోదీ సీఎంగా పనిచేసిన గుజరాత్‌లో కానీ, దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో కానీ మేం ఇచ్చినట్లుగా 10నెలల్లోనే 59వేల ఉద్యోగాలిచ్చినట్లు రికార్డ్ ఉందా? నేను చర్చకు సిద్ధం. విజ్ఞతతో ఉద్యోగాలిచ్చాం. ప్రజాపాలనతో దేశానికే తెలంగాణ ఓ మోడల్‌గా నిలబడింది’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!