News March 8, 2025
TODAY HEADLINES

➤ డీలిమిటేషన్‌తో దక్షిణాదిపై BJP కుట్ర: CM రేవంత్
➤ ఈ నెల 12 నుంచి TG అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
➤ BRS MPలు లేకనే TGకు అన్యాయం: KCR
➤ రంగన్న మృతి అనుమానాస్పదం: CM CBN
➤ జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రతిపాదనల్లేవు: అనగాని
➤ AP అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు గ్రాట్యుటీ పెంపు
➤ రెండో రోజూ తగ్గిన బంగారం ధరలు
➤ జన్ ఔషధీ కేంద్రాలతో రూ.30K కోట్లు ఆదా: నడ్డా
➤ Stock Markets: ఆఖర్లో ప్రాఫిట్ బుకింగ్..
Similar News
News March 24, 2025
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం

TG: బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 19 మంది బెట్టింగ్ యాప్ ఓనర్లపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో ఇటీవల కేసులు నమోదైన సెలబ్రిటీలను సాక్షులుగా మార్చాలనే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో 25 మంది సెలబ్రిటీలపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
News March 24, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్‌కు ఊరట

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్‌కు ఊరట దక్కింది. అతడిని అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో శ్రవణ్ పోలీసుల విచారణకు సహకరించాలని పేర్కొంది. ఇదే కేసులో నిందితుడు ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం 2 వారాల సమయం కోరింది. దీంతో విచారణను ఉన్నత న్యాయస్థానం 2 వారాలు వాయిదా వేసింది.
News March 24, 2025
పబ్లిక్ ఇష్యూకు Meesho

దేశీయ ఇ-కామర్స్ కంపెనీ Meesho పబ్లిక్ ఇష్యూకు రాబోతోంది. బిలియన్ డాలర్ల విలువైన IPO కోసం కొటక్ మహీంద్రా క్యాపిటల్, సిటీ బ్యాంకును లీడ్ బ్యాంకర్లుగా ఎంచుకుందని తెలిసింది. గత ఏడాది $3.9B గా ఉన్న విలువను 2.5 రెట్లకు పెంచి $10Bగా చూపాలని భావిస్తోంది. సేల్స్ పెరుగుతాయి కాబట్టి దీపావళి టైమ్‌లో లిస్టింగ్‌కు రావాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అమెజాన్, ఫ్లిప్‌కార్టుకు మీషో బలమైన పోటీదారుగా అవతరించింది.