News March 30, 2025
TODAY HEADLINES

✒ సౌదీలో కనిపించిన చంద్రుడు.. ఎల్లుండి రంజాన్
✒ భూకంపం: మయన్మార్‌లో 1,644 మంది మృతి
✒ మయన్మార్‌ను ఆదుకునేందుకు భారత్ ‘ఆపరేషన్ బ్రహ్మ’
✒ ఏపీలో APR 30 వరకు రేషన్ కార్డ్ EKYC గడువు
✒ ఛత్తీస్‌గఢ్‌లో 15మంది మావోలు హతం
✒ NTR లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు: CBN
✒ 10 రోజుల్లో DSC నోటిఫికేషన్: లోకేశ్
✒ వక్ఫ్ బిల్లును తొలుత వ్యతిరేకించింది నేనే: రేవంత్
✒ మీ గ్యారంటీలకు మేం నిధులివ్వాలా?: కిషన్‌రెడ్డి
Similar News
News April 1, 2025
‘మోనాలిసా’ డైరెక్టర్ అరెస్ట్.. బిగ్ ట్విస్ట్

‘మోనాలిసా’ డైరెక్టర్ <<15946962>>సనోజ్ మిశ్రా<<>> తనపై లైంగిక దాడి చేశాడని ఓ యువతి ఫిర్యాదు మేరకు ఆయన్ను ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ట్విస్ట్ నెలకొంది. తనపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని, సనోజ్ అమాయకుడు అని ఆ యువతి తెలిపారు. ఆయన్ను కావాలనే కొందరు ఇలా ఇరికిస్తున్నారని ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను సనోజ్‌తో ఉండటం, గొడవ పడటం వాస్తవమే కానీ.. ఎప్పుడూ ఆయన తనపై లైంగిక దాడి చేయలేదని వివరించారు.
News April 1, 2025
పీఎఫ్ విత్‌డ్రా లిమిట్ భారీగా పెంపు!

పీఎఫ్ విత్‌డ్రా లిమిట్‌ను పెంచేందుకు కేంద్రం అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.లక్షగా ఉన్న ఆటో సెటిల్‌మెంట్ రూ.5 లక్షలకు పెంచాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో 7.5 కోట్ల మంది EPFO ఖాతాదారులకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. విద్య, వివాహ, ఇంటి ఖర్చులకు అప్లై చేసుకున్న మూడు రోజుల్లో పీఎఫ్ డబ్బులు ఖాతాలో జమచేస్తోంది.
News April 1, 2025
తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ స్ట్రీమింగ్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ OTT తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. కొన్ని రోజుల కిందటే ఇది అమెజాన్ ప్రైమ్ OTTలోకి రాగా, ఇవాళ్టి నుంచి తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. యూత్ ఫుల్ లవ్ స్టొరీతో వచ్చిన ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. జీవీ ప్రకాశ్ సంగీతం అందించిన ఈ మూవీలో ప్రియాంకా మోహన్ స్పెషల్ సాంగ్‌లో కనిపించారు.