News April 8, 2025
TODAY HEADLINES

* ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆస్పత్రులు: సీఎం చంద్రబాబు
* గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంపు
* గిరిజన యువత గంజాయి సాగు వదిలేయాలి: పవన్ కళ్యాణ్
* HCU విద్యార్థులపై కేసులు ఎత్తేయండి: భట్టి
* భూకబ్జా కేసులో వల్లభనేని వంశీకి బెయిల్
* భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
* రామ్ చరణ్ ‘పెద్ది’ సెన్సేషన్ రికార్డు
* రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి
Similar News
News April 20, 2025
త్వరలో 3,038 పోస్టులకు నోటిఫికేషన్: మంత్రి

TGSRTCలో త్వరలో 3,038 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇందులో డ్రైవర్ 2000, శ్రామిక్ 743, డిప్యూటీ సూపరింటెండెంట్(ట్రాఫిక్) 84, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్) 114, డిపో మేనేజర్ 25, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ 18, అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్) 23, సెక్షన్ ఆఫీసర్(సివిల్) 11, అకౌంట్ ఆఫీసర్ 6, మెడికల్ ఆఫీసర్ జనరల్ 7, మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ 7 పోస్టులున్నాయి.
News April 20, 2025
చంద్రబాబుకు YS జగన్ బర్త్‌డే విషెస్

AP: ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీ CM వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన, దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నాను’ అని Xలో పోస్ట్ చేశారు. అటు కేంద్రమంత్రులు, మంత్రులు చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.
News April 20, 2025
స్వల్పంగా తగ్గిన చికెన్ ధరలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.220గా ఉంది. విజయవాడ, ఖమ్మంలో స్కిన్‌లెస్ రూ.220 నుంచి రూ.230 వరకు పలుకుతోంది. గత వారం కిలో చికెన్ ధర రూ.260 వరకు అమ్మారు. అలాగే కరీంనగర్‌లో రూ.220-240 వరకు పలుకుతోంది. కాకినాడ, విశాఖపట్నంలోనూ రూ.220-240 వరకు ఉంది. చిత్తూరులో కిలో రూ.160-170గా ఉంది.