News June 12, 2024
TODAY HEADLINES

* రేపు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
* విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రులు అమిత్ షా, నడ్డా
* TG: ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్‌కు నోటీసులు
* ఆహార నాణ్యత పాటించకపోతే కఠిన చర్యలు: మంత్రి రాజనర్సింహ
* సింగరేణి కారుణ్య నియామకాల్లో వారసులకు వయోపరిమితి పెంపు
* ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాఝీ
* విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా మృతి
Similar News
News March 27, 2025
భాషను వ్యతిరేకించేది అందుకే…UP సీఎంకు స్టాలిన్ కౌంటర్

తమిళనాడులో జరుగుతున్న ద్విభాషా ఉద్యమం న్యాయం, గౌరవం కోసమే తప్ప ఓట్ల కోసం కాదని సీఎం స్టాలిన్ స్పష్టతనిచ్చారు. తాము ఏ భాషను వ్యతిరేకించట్లేదని బలవంతంగా తమపై రుద్దడాన్నిమాత్రమే అడ్డుకుంటున్నామని తెలిపారు. ఓట్ల కోసమే NEPని వ్యతిరేకిస్తున్నారని UP సీఎం ఆరోపణలకు X వేదికగా స్టాలిన్ కౌంటరిచ్చారు. డీలిమిటేషన్, ఎడ్యుకేషనల్ పాలసీలపై రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమం బీజేపీ నేతలను కలవరపెడుతోందని తెలిపారు.
News March 27, 2025
అట్లీతో సినిమా…సల్మాన్ ఖాన్ క్లారిటీ ఇదిగో!

అట్లీ డైరెక్షన్‌లో మూవీ చేసే అవకాశాలు దాదాపు లేనట్లేనని సల్మాన్ ఖాన్ ప్రకటించారు. ఈ చిత్ర పనులు ప్రారంభించినప్పుడు ఎలాగైనా పూర్తి చేయాలని భావించాం, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరిదిద్దడానికి ప్రయత్నించాం కానీ ఇది ముందుకు సాగటం లేదని తెలిపారు. సికిందర్ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వూలో సల్మాన్ ఈ విషయాలు పంచుకున్నారు. గత కొన్ని రోజులుగా అట్లీ-సల్మాన్ చిత్రం ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.
News March 27, 2025
కొన్న 4 రోజుల్లోనే కారు బ్రేక్ డౌన్.. కస్టమర్ ఏం చేశాడంటే?

రూ.లక్షలు పెట్టి కొన్న కారు కొద్ది రోజులకే బ్రేక్ డౌన్ అయితే ఎలా ఉంటుంది? హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గల ‘టాటా’ షోరూమ్‌లో కారు కొన్న ఓ కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. అతను కొన్న కారు 4 రోజుల్లోనే ఆగిపోతుండటంతో షోరూమ్‌కు వచ్చి సిబ్బందిని నిలదీశాడు. అడిగినందుకు తనపై దాడి చేశారంటూ వినూత్నంగా నిరసన తెలిపాడు. తన సమస్యను అందరికీ తెలియజేసేలా ఫ్లెక్సీని కారు వెనకాల ఏర్పాటు చేసి షోరూమ్ వద్ద బైఠాయించాడు.