News June 16, 2024
TODAY HEADLINES
➥AP:నామినేటెడ్ పోస్టులు త్వరలో భర్తీ చేస్తాం: CM చంద్రబాబు
➥AP:త్వరలో కొత్త ఐటీ పాలసీ: నారా లోకేశ్
➥రెండున్నరేళ్లలో అమరావతిని నిర్మిస్తాం: మంత్రి నారాయణ
➥టీడీపీ-వైసీపీ మధ్య ‘ఫర్నిచర్’ వార్
➥TG: హోంగార్డుల నియామకం చేపట్టాలి: సీఎం రేవంత్
➥TG:రాజకీయ కక్షతోనే ఈఆర్సీ కమిషన్: KCR
➥TG:రాష్ట్రంలో 20 మంది ఐఏఎస్‌ల బదిలీ
➥T20WC: వర్షం కారణంగా భారత్-కెనడా మ్యాచ్ రద్దు
Similar News
News September 20, 2024
‘మీసేవ’లో సర్వర్ సమస్యలు.. ప్రజలకు ఇబ్బందులు
TG: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 వారాలుగా ‘మీసేవ’ సర్వర్లలో సమస్యలు ఏర్పడుతున్నాయి. క్యాస్ట్, ఇన్‌కమ్, నివాస, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఇతర సర్టిఫికెట్లు డౌన్‌లోడ్ కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. రాష్ట్రంలోని 5,216 మీసేవా కేంద్రాల ద్వారా 38 శాఖలకు చెందిన 204 రకాల సేవలు అందుతున్నాయి.
News September 20, 2024
కూటమి పాలనకు 100 రోజులు.. ‘ఇది మంచి ప్రభుత్వమేనా?’
AP: కూటమి పాలనకు నేటితో 100 రోజులు పూర్తవడంతో 26వ తేదీ వరకు ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో MLAలు క్యాంపెయిన్ చేయనున్నారు. పెన్షన్ల పెంపు, మెగా DSC, అన్న క్యాంటీన్లు, అమరావతి, పోలవరానికి నిధులు, ‘ల్యాండ్ టైటిలింగ్’ రద్దు తదితర 100 కార్యక్రమాలు చేశామని నేతలు చెబుతున్నారు. ‘సూపర్-6’ ఊసు లేదని, ప్రత్యర్థులపై దాడులు, హత్యలు తప్ప చేసిందేమీ లేదని YCP విమర్శిస్తోంది. మీరేమంటారు? ఇది మంచి ప్రభుత్వమేనా?
News September 20, 2024
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.500 కోట్లు?
AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతోందన్న ఆరోపణల వేళ కేంద్రం ఈ ఫ్యాక్టరీకి రూ.500 కోట్లు మంజూరు చేసినట్లు సమాచారం. ఈ నిధులతో జీఎస్టీ, ఉద్యోగ భవిష్య నిధి, ప్రభుత్వ లెవీలు వంటి చట్టబద్ధమైన చెల్లింపులు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. చెల్లింపుల నిర్వహణను SBIకి అప్పగించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇతర అంశాలకు వినియోగిస్తే వెంటనే నిలిపేయాలని సూచించినట్లు పేర్కొంటున్నాయి.