News August 2, 2024

TODAY HEADLINES

image

* రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీల వర్గీకరణ చేయవచ్చు: సుప్రీంకోర్టు
* ఒలింపిక్స్: కాంస్యం సాధించిన భారత షూటర్ స్వప్నిల్
* రేపే జాబ్ క్యాలెండర్ విడుదల: TG ప్రభుత్వం
* TGలో కొత్త రేషన్ కార్డుల జారీకి క్యాబినెట్ ఆమోదం
* అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ నిరసన.. కేటీఆర్, హరీశ్ అరెస్ట్
* ఏపీలో 96% పింఛన్ల పంపిణీ పూర్తి
* ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పును స్వాగతించిన CBN, రేవంత్

Similar News

News October 25, 2025

డీసీసీల నియామకం.. వేణుగోపాల్‌తో రేవంత్, భట్టి, మహేశ్ భేటీ

image

TG: రాష్ట్రంలో డీసీసీల నియామకంపై కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. ఇవాళ ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్.. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్‌తో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ సైతం హాజరయ్యారు. డీసీసీల నియామకం, క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్ఠం చేయడంపై చర్చించారు.

News October 25, 2025

RO-KO: రిటైర్మెంట్ కాదు రీలోడెడ్

image

ఓడిపోయిన సిరీస్ గురించి బాధలేదు.. కానీ రోహిత్, కోహ్లీ కలిసి నిలబడితే భారత్‌కు ఎదురే లేదని మరోసారి నిరూపితమైంది. సగటు భారత క్రికెట్ అభిమాని కోరుకునేది ఇదే కదా! చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలివిడిగా ఆడి.. విడివిడిగా గెలిచారు. భారత్‌ను గెలిపించారు. రిటైర్మెంట్ వార్తల వేళ రోహిత్ సెంచరీ, విరాట్ హాఫ్ సెంచరీ చేసి తమలో ఇంకా ఫైర్ తగ్గలేదని చూపించారు. వారి జోడీ ఇలాగే కొనసాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News October 25, 2025

కాసేపట్లో వర్షం

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రి 10 గంటలలోపు వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, భద్రాద్రి, హైదరాబాద్, కామారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, RR, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కాగా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని IMD ఇప్పటికే హెచ్చరించింది.