News August 2, 2024

TODAY HEADLINES

image

* రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీల వర్గీకరణ చేయవచ్చు: సుప్రీంకోర్టు
* ఒలింపిక్స్: కాంస్యం సాధించిన భారత షూటర్ స్వప్నిల్
* రేపే జాబ్ క్యాలెండర్ విడుదల: TG ప్రభుత్వం
* TGలో కొత్త రేషన్ కార్డుల జారీకి క్యాబినెట్ ఆమోదం
* అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ నిరసన.. కేటీఆర్, హరీశ్ అరెస్ట్
* ఏపీలో 96% పింఛన్ల పంపిణీ పూర్తి
* ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పును స్వాగతించిన CBN, రేవంత్

Similar News

News October 4, 2024

ప్రతి రైతుకి యూనిక్ ఐడీ కార్డు.. వ్యవసాయ శాఖ కసరత్తు

image

APలోని రైతులందరికీ యూనిక్ ఐడీ కార్డులు ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. కేంద్రం తెచ్చిన ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ-పంట కోసం రైతుల ఆధార్‌ను వెబ్‌ల్యాండ్‌తో అనుసంధానించారు. ఈ నేపథ్యంలో ID కార్డుల జారీ ప్రక్రియ సులభంగా పూర్తి చేయొచ్చని అధికారులు భావిస్తున్నారు. మొత్తం 50 లక్షల మంది రైతులుండగా, 1.90 లక్షల మంది అటవీ భూముల రైతులనూ ఇందులోకి తెస్తున్నారు.

News October 4, 2024

USలో 27 ఏళ్లు వచ్చినా కొందరు చిన్నపిల్లలే: సర్వే

image

అమెరికా అభివృద్ధిలో దూసుకెళ్తున్నప్పటికీ అక్కడున్న వారు ఆలోచనల్లో కాస్త వెనుకబడినట్లు తెలుస్తోంది. ‘టాకర్ రీసెర్చ్’ సర్వే ప్రకారం చాలా మంది అమెరికన్లు 27 ఏళ్లు వచ్చాకే లైఫ్ గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారని తేలింది. ఇందులో 11% మంది ఇంకా పెద్దవాళ్లం కాలేదన్నారు. అడల్ట్‌హుడ్ అంటే బిల్లులు చెల్లించడమేనని 56% మంది చెప్పారు. 45% మంది ఆర్థిక స్వాతంత్ర్యం, బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వడమన్నారు.

News October 4, 2024

జంతువులకూ ఓ రోజు ఉంది!

image

ప్రకృతి జీవావరణాన్ని సమతుల్యంగా ఉంచడానికి పర్యావరణ వ్యవస్థలోని అన్ని జాతులు సహజీవనం చేస్తాయి. జంతు హక్కులు, సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం అక్టోబర్ 4న ప్రపంచ జంతు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జంతు సంపదను పరిరక్షించడం, వాటిని వృద్ధి చేయడంతోపాటు జంతువుల హక్కులను కాపాడటం దీని ఉద్దేశం. 1925, మార్చి 24న జర్మనీలోని బెర్లిన్‌లో తొలిసారి జంతువుల దినోత్సవాన్ని నిర్వహించారు.