News August 10, 2024
TODAY HEADLINES
* తెలంగాణకు ‘ఫ్యూచర్ స్టేట్’ ట్యాగ్‌లైన్: సీఎం రేవంత్
* ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ: భట్టి విక్రమార్క
* సుంకిశాల ఘటనకు రేవంతే బాధ్యుడు: కేటీఆర్
* అన్ని రంగాల్లో గిరిజనులు ముందుండాలనేదే నా ఆకాంక్ష: CM CBN
* వైసీపీకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా
* రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను నాశనం చేస్తున్నారు: YS జగన్
* మనీశ్ సిసోడియాకు బెయిల్.. జైలు నుంచి విడుదల
Similar News
News September 19, 2024
‘జమిలి’కి రాష్ట్రాలు అంగీకరిస్తాయా?
జమిలి ఎన్నికలు జరగాలంటే కీలక రాజ్యాంగ సవరణలతో పాటు రాష్ట్రాల సమ్మతి కూడా అవసరం. జమిలికి 14 రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదిస్తూ తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎన్డీయేకి ఇబ్బందులు లేనట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో 20 రాష్ట్రాల్ని ఎన్డీయే మిత్రపక్షాలు పాలిస్తున్నాయి. అందులో 13 రాష్ట్రాల్ని బీజేపీ సొంతంగా ఏలుతోంది. దీంతో ఈ విషయంలో ఎన్డీయేకి ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి లేదు.
News September 19, 2024
నాని-శ్రీకాంత్ మూవీ స్టార్ట్.. ‘దసరా’ను మించనుందా?
నేచురల్ స్టార్ నాని హీరోగా, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో సెకండ్ సినిమా స్టార్ట్ అయింది. నిన్న షూటింగ్ స్టార్ట్ చేసినట్లు శ్రీకాంత్ తెలిపారు. ‘‘గతేడాది మార్చి 7న ‘దసరా’ సినిమా కోసం చివరిసారి ‘కట్, షాట్ ఓకే’ అని చెప్పా. మళ్లీ నిన్న నానికి ‘యాక్షన్’ చెప్పా. 48,470,400 సెకన్లు గడిచాయి. నా తర్వాతి సినిమా కోసం నిజాయితీగా ప్రతి సెకను వెచ్చించా. దసరాను మించిన మూవీ ఇది’’ అని ఓదెల ట్వీట్ చేశారు.
News September 19, 2024
రేపటి నుంచి కాళేశ్వరంపై మరోసారి విచారణ
TG: రేపటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలపై జుడీషియల్ కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ చేపట్టనుంది. అఫిడవిట్లు ఇచ్చిన ఇంజినీర్లు, అధికారులను విచారించనుంది. ఎవరిని విచారించాలనే అంశమై కమిషన్ ఛైర్మన్ పీసీ.ఘోష్ నిర్ణయం తీసుకోనున్నారు. గత నెలలో పలువురు అధికారులను ఆయన విచారించిన సంగతి తెలిసిందే.