News November 18, 2024

నేడు హైదరాబాద్‌లో ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్

image

నేడు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో భారత్, మలేషియా జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది 10 మ్యాచుల్లో ఒక్క విజయం సాధించని భారత్ బోణీ కొట్టాలని చూస్తోంది. మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. జియో సినిమా, స్పోర్ట్స్ 18 3 టీవీ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. ప్రస్తుతం ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్ 125, మలేషియా 133వ స్థానాల్లో ఉన్నాయి.

Similar News

News December 2, 2024

నటి ఆత్మహత్య.. మామ ఏమన్నారంటే?

image

సీరియల్ నటి శోభిత ఆత్మహత్యపై ఆమె మామ బుచ్చిరెడ్డి స్పందించారు. శోభితను కన్నబిడ్డలా చూసుకున్నామని, తమతో బాగా కలిసిపోయిందని చెప్పారు. తన కుమారుడు సుధీర్ రెడ్డితో అన్యోన్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఇలా జరగడం దురదృష్టకరమని చెప్పారు. కాగా పోస్టుమార్టం నివేదికలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించగా కర్ణాటకకు తీసుకెళ్లారు.

News December 2, 2024

విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే?

image

ప్రత్యేక పరిస్థితుల్లో అంతర్జాతీయంగా <<14769455>>ముడిచమురు<<>> ధరలు పెరిగితే ఇంధన కంపెనీలకు భారీ లాభాలు వస్తుంటాయి. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్, ATF, క్రూడ్ ఉత్పత్తులపై విధించే అత్యధిక పన్నునే ‘విండ్ ఫాల్ ట్యాక్స్’ అంటారు. 2022 జులై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేస్తోంది. కొంతకాలంగా పన్ను రద్దు చేసేందుకు కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో ఇవాళ రద్దు చేసింది.

News December 2, 2024

శిండేకు అనారోగ్యం.. ఢిల్లీకి అజిత్ పవార్

image

మ‌హారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులు గడుస్తున్నా మహాయుతిలో పదవుల పంపకం కొలిక్కిరావడం లేదు. కీలక శాఖల కోసం శివసేన, NCP పట్టుబడుతున్నాయి. శాఖల కేటాయింపు తేలకపోవడంతోనే CM అభ్యర్థి ప్రకటనను బీజేపీ వాయిదా వేస్తోంది. దీనిపై సోమవారం జ‌ర‌గాల్సిన మ‌హాయుతి నేత‌ల స‌మావేశం శిండే అనారోగ్యం వ‌ల్ల వాయిదా ప‌డినట్టు తెలిసింది. మరోవైపు కోరిన శాఖల్ని దక్కించుకొనేందుకు అజిత్ పవార్ మళ్లీ ఢిల్లీకి పయనమయ్యారు.