News March 14, 2025

ఇవాళ సెలవు

image

హోలీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నేడు పబ్లిక్ హాలిడే ఉంది. అన్ని రకాల విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూతబడనున్నాయి. శనివారం నుంచి రెండు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు ప్రారంభం అవుతాయి. ఏపీలో ఉ.7.45 నుంచి మ.12.30 వరకు, తెలంగాణలో ఉ.8 నుంచి మ.12.30 గంటల వరకు స్కూళ్లు నడుస్తాయి.

Similar News

News January 16, 2026

ESIC మెడికల్ కాలేజీ&హాస్పిటల్‌లో ఉద్యోగాలు

image

నోయిడాలోని<> ESIC <<>>మెడికల్ కాలేజీ&హాస్పిటల్‌ 19 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 27న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి MBBS, PG/DNB/డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.500. SC/ST/PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in

News January 16, 2026

జస్టిస్ యశ్వంత్ వర్మకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

image

తనపై పార్లమెంటరీ ప్యానెల్ దర్యాప్తును సవాల్ చేస్తూ జస్టిస్ యశ్వంత్ వర్మ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. న్యాయమూర్తుల విచారణ చట్టం 1965 ప్రకారం ఉమ్మడి కమిటీ తప్పనిసరి అనే ఆయన వాదనను తోసిపుచ్చింది. లోక్‌సభ స్పీకర్ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ తదుపరి చర్యలు చేపట్టడానికి అడ్డంకులను తొలగిస్తూ తీర్పు వెలువరించింది. 2025 మార్చిలో యశ్వంత్ నివాసంలో భారీ నోట్ల కట్టలు బయటపడిన సంగతి తెలిసిందే.

News January 16, 2026

తప్పిన యుద్ధ గండం: అరబ్ దేశాల దౌత్యంతో వెనక్కి తగ్గిన ట్రంప్!

image

ఇరాన్‌పై సైనిక చర్యకు సిద్ధమైన ట్రంప్ అనూహ్యంగా వెనక్కి తగ్గారు. నిరసనకారులపై కాల్పులు, ఉరిశిక్షలను ఇరాన్ నిలిపివేసిందన్న సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని వెనక సౌదీ, ఖతర్, ఒమన్ దేశాల ‘మధ్యరాత్రి దౌత్యం’ పనిచేసినట్లు తెలుస్తోంది. యుద్ధం వల్ల ప్రాంతీయ అస్థిరత ఏర్పడి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ దేశాలు హెచ్చరించడంతో ట్రంప్ శాంతించినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతానికి యుద్ధ భయాలు తొలగినట్లే!