News July 22, 2024
ఈ జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు

AP: భారీ వర్షాల నేపథ్యంలో పశ్చిమ గోదావరి, ఏలూరు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు కలెక్టర్లు సోమవారం సెలవు ప్రకటించారు. మంగళవారం కూడా వర్షాల తీవ్రత ఇలాగే కొనసాగితే మరో రోజు సెలవు పొడిగించడంపై నిర్ణయం తీసుకోనున్నారు. అల్లూరి జిల్లాలోని రంపచోడవరం డివిజన్‌లోని 4 మండలాల్లోని స్కూళ్లకు 2 రోజులు సెలవులు ఇచ్చారు.
Similar News
News December 1, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో నిలిచిన మీసేవ సేవలు

జిల్లాలోని మీసేవ కేంద్రాల్లో రెండు రోజులుగా సర్వర్ పనిచేయకపోవడంతో పౌర సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం కేంద్రాలకు వచ్చిన లబ్ధిదారులు గంటల తరబడి వేచి ఉండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికలు, విద్యా సంబంధిత అవసరాల కోసం వచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే సర్వర్ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
News December 1, 2025
ఢిల్లీకి మంత్రి లోకేశ్.. రేపు కేంద్ర మంత్రులతో భేటీ

AP: మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీ వెళ్లారు. వారికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు స్వాగతం పలికారు. రేపు పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్‌తో లోకేశ్, అనిత భేటీ కానున్నారు. మొంథా తుఫాను ప్రభావం వల్ల జరిగిన నష్టం అంచనా రిపోర్టును వారికి అందిస్తారు.
News December 1, 2025
దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ కన్నుమూత

ఇటలీకి చెందిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్, రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత నికోలా పియట్రాంగెలీ(92) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇటలీ టెన్నిస్ ఫెడరేషన్ ధ్రువీకరించింది. ప్రపంచ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇటలీ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ప్లేయర్ నికోలానే కావడం విశేషం. తన కెరీర్‌లో 44 సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు. ఆయన తండ్రి ఇటలీకి చెందిన వ్యక్తి కాగా తల్లి రష్యన్. నికోలా 1933లో జన్మించారు.


