News July 22, 2024

ఈ జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు

image

AP: భారీ వర్షాల నేపథ్యంలో పశ్చిమ గోదావరి, ఏలూరు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు కలెక్టర్లు సోమవారం సెలవు ప్రకటించారు. మంగళవారం కూడా వర్షాల తీవ్రత ఇలాగే కొనసాగితే మరో రోజు సెలవు పొడిగించడంపై నిర్ణయం తీసుకోనున్నారు. అల్లూరి జిల్లాలోని రంపచోడవరం డివిజన్‌లోని 4 మండలాల్లోని స్కూళ్లకు 2 రోజులు సెలవులు ఇచ్చారు.

Similar News

News November 16, 2025

పెద్దపల్లిలో డ్రగ్స్ నియంత్రణపై సమీక్ష

image

PDPL కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డి.వేణు మాదకద్రవ్యాల నియంత్రణపై శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ దుష్ప్రభావాలపై పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. టీనేజ్ పిల్లలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు క్షుణ్నంగా పరిశీలించాలన్నారు. గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన 10 పడకల డీ-అడిక్షన్ సెంటర్‌ను సద్వినియోగం చేయాలని సూచించారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News November 15, 2025

iBOMMA నిర్వాహకుడికి 14 రోజుల రిమాండ్

image

TG: దేశవ్యాప్తంగా సినిమాలు, ఓటీటీ కంటెంట్‌ను పైరసీ చేస్తోన్న <<18297457>>iBOMMA<<>> నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. కూకట్‌పల్లిలోని ఓ ఫ్లాట్‌లో ఉండగా రవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పైరసీల ద్వారా అతను రూ.కోట్లు సంపాదించాడనే ఆరోపణలున్నాయి.

News November 15, 2025

దేశ‌మంతా గ‌ర్వంగా ఫీల‌వుతుంది: మ‌హేశ్ బాబు

image

వారణాసి సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని మహేశ్ బాబు తెలిపారు. ‘ఈ సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డాలో అంత క‌ష్ట‌ప‌డ‌తాను. అంద‌రూ గ‌ర్వప‌డేలా చేస్తాను. ముఖ్యంగా రాజ‌మౌళిని. ఇది విడుద‌లైన త‌ర‌వాత దేశ‌మంతా గ‌ర్వంగా ఫీల‌వుతుంది’ అని అన్నారు. ‘పౌరాణికం చేయ‌మ‌ని నాన్న‌ అడుగుతుండేవారు. ఆయ‌న మాట‌లు ఎప్పుడూ విన‌లేదు. ఇప్పుడు ఆయ‌న నా మాట‌లు వింటుంటారు’ అని గ్లోబ్‌ట్రాటర్‌ ఈవెంట్‌‌లో మాట్లాడారు.