News August 23, 2024

నేడు నేషనల్ స్పేస్ డే

image

చంద్రయాన్-3 మిషన్ గత ఏడాది సరిగ్గా ఇదే రోజు చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ అయింది. దీంతో దక్షిణ పోలార్ రీజియన్‌లో రోవర్‌ను ల్యాండ్ చేసిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ అరుదైన మైలురాయికి జ్ఞాపకంగా ఈరోజును జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరపాలని కేంద్రం నిర్ణయించింది. ఇవాళ ఢిల్లీలో ఇస్రో ఆధ్వర్యంలో జరగనున్న తొలి నేషనల్ స్పేస్ డే వేడుకల్లో రాష్ట్రపతి ముర్ము పాల్గొననున్నారు.

Similar News

News September 12, 2024

మనుషుల నుంచీ కాంతి వెలువడుతోంది!

image

మానవుడి నుంచి సైతం చిన్నపాటి వెలుగు ఉత్పన్నమవుతుందనే విషయాన్ని జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. జీవులు తమ కణాలలో జరిగే రసాయన ప్రతిచర్యల కారణంగా కాంతిని ఉత్పత్తి చేస్తాయని తెలిపారు. ఈ కాంతి గుర్తించేందుకు చాలా రోజులుగా అల్ట్రా-సెన్సిటివ్ కెమెరాలను వినియోగించారు. బుగ్గలు, నుదుటి, మెడ నుంచి ప్రకాశవంతమైన కాంతి వెలువడే దృశ్యాలను బంధించారు.

News September 12, 2024

హరియాణా అసెంబ్లీ రద్దు

image

హరియాణా అసెంబ్లీని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఉత్తర్వులు జారీ చేశారు. 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీకి అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. అదేనెల 8న ఫలితాలు వెలువడతాయి. ఈ నేపథ్యంలోనే గవర్నర్ అసెంబ్లీని రద్దు చేశారు.

News September 12, 2024

ఇందుకేనా మిమ్మల్ని ఎన్నుకున్నది?: అంబటి రాంబాబు

image

AP: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు Xలో సెటైర్లు వేశారు. ‘ఏలేరు వరదలకీ జగనే, బుడమేరు వరదలకీ జగనే, అచ్యుతాపురం పేలుళ్లకీ జగనే.. ఇలా అన్నింటికీ జగనే అని చెప్పడానికా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది?’ అని ప్రశ్నించారు.