News May 4, 2024

నేడు ISL-10 ఫైనల్

image

మెగా ఫుట్‌బాల్ టోర్నీ ఇండియన్ సూపర్ లీగ్(ISL) పదో సీజన్ ఫైనల్ నేడు జరగనుంది. కోల్‌కతాలోని సాల్ట్‌ లేక్ స్టేడియంలో మోహన్ బగాన్ సూపర్ జెయింట్స్, ముంబై సిటీ మధ్య రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. గత SEPలో ప్రారంభమైన ఈ లీగ్‌లో 12జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ చేరిన ఈ 2జట్లు ఇప్పటికే ఒక్కోసారి ISL కప్ సొంతం చేసుకోవడం విశేషం. కాగా బగాన్ జట్టు యాజమాన్యం ఐపీఎల్‌లో LSG మేనేజ్‌మెంట్ ఒక్కటే కావడం గమనార్హం.

Similar News

News January 16, 2026

HYD: రూ.40K, రూ.లక్ష సాలరీతో ఉద్యోగాలు

image

HYD ECILలో 15 పోస్టులను భర్తీ చేయనుంది. ప్రాజెక్ట్ ఆఫీసర్-C(10), SAP SPECIALIST C(5) పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులకు ఏదైనా డిగ్రీలో 50% ఉత్తీర్ణతతో పాటు పనిలో అనుభవం గల అభ్యర్థులు జనవరి 28, 29 తేదీల్లో ECIL HYDలో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. ఎలాంటి అప్లికేషన్, ఫీజు లేదు. ప్రాజెక్ట్ ఆఫీసర్‌లకు నెలకు రూ.40,000, SAP స్పెషలిస్ట్‌కు రూ.1,25,000 జీతం ఉంటుంది. వివరాలకు <>https://www.ecil.co.in/<<>>లో చూడండి.

News January 16, 2026

12,000 మంది మృతి.. ఎక్కడికక్కడ శవాల గుట్టలు!

image

ఇరాన్‌లో జరిగిన నిరసనల్లో 12 వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. మెషీన్ గన్లతో పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపారనే ఆరోపణలు వస్తున్నాయి. వందల మృతదేహాలు ఉన్న ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. చనిపోయిన వారిని కుటుంబ సభ్యులు తీసుకెళ్లాలని లేదంటే సామూహిక సమాధి చేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే నిన్నటి నుంచి కాల్పులు ఆగినట్లు US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.

News January 16, 2026

రేపు కాకినాడ.. ఎల్లుండి అమరావతిలో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు రేపు కాకినాడలో పర్యటించి అమ్మోనియం ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఎల్లుండి ఆయన అమరావతిలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభిస్తారు. ఈ నెల 19న సీఎం దావోస్ పర్యటనకు వెళ్తారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఈ టూర్ ఉండనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రస్తుతం సీఎం స్వగ్రామం నారావారిపల్లెలో ఉన్న విషయం తెలిసిందే.