News September 18, 2024
నేడు జమ్మూకశ్మీర్‌లో తొలి దశ పోలింగ్
పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. తొలిదశలో ఇవాళ 24 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 219 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 23 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. 3,276 పోలింగ్ కేంద్రాలను EC సిద్ధం చేసింది. ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. INC-NC కలిసి పోటీ చేస్తుండగా, PDP, BJP, JKPM, PC, ఆప్నీ పార్టీలు విడివిడిగా బరిలో ఉన్నాయి.
Similar News
News October 4, 2024
నేటి ముఖ్యాంశాలు
* సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న మంత్రి సురేఖ
* సురేఖపై పరువునష్టం దావా వేసిన నాగార్జున
* సురేఖ వ్యాఖ్యలను ఖండించిన చిరు, ఎన్టీఆర్, మహేశ్, నాని
* కిరాయి మనుషులతో కేటీఆర్, హరీశ్ హడావుడి: రేవంత్
* జగన్ లడ్డూ అపవిత్రం చేశారని మేం చెప్పలేదు: పవన్
* కేసులకు YCP శ్రేణులు భయపడొద్దు: జగన్
* PM-RKVY స్కీమ్‌కు కేంద్రం రూ.లక్ష కోట్ల మంజూరు
News October 4, 2024
ఒక్కో కార్మికుడికి ₹1.92 లక్షల జీతం, ₹16,515 బోనస్
పాలస్తీనా, లెబనాన్, ఇరాన్‌తో యుద్ధాల వల్ల ఇజ్రాయెల్‌లో ఏర్పడిన కార్మికుల కొరత భారతీయులకు కాసుల పంట కురిపిస్తోంది. ఇజ్రాయెల్‌లో పనిచేయడానికి భారత ప్రభుత్వం ద్వారా ఎంపికైన స్కిల్డ్ వర్కర్స్‌కు నెలకు ₹1.92 లక్షల జీతం, ₹16,515 బోనస్, వైద్య బీమా, వసతి లభిస్తోంది. ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా సరే భారతీయులు అక్కడ పనిచేయడానికి క్యూ కడుతున్నారు. ఇప్పటిదాకా 11 వేల మందిని ఎంపిక చేశారు.
News October 4, 2024
ఈ నెల 14న హ్యుందాయ్ IPO
దేశీయ స్టాక్ మార్కెట్లోనే ₹25,000 కోట్ల అతిపెద్ద హ్యుందాయ్ IPO అక్టోబర్ 14న ప్రారంభంకానున్నట్టు తెలుస్తోంది. సెబీకి దాఖలు చేసిన కంపెనీ DRHP ప్రకారం సంస్థ భారతీయ విభాగం కంపెనీ, ప్రమోటర్ల ద్వారా 142,194,700 ఈక్విటీ షేర్ల ఆఫర్-ఫర్-సేల్ (OFS)ని ప్రతిపాదించింది. ఈ IPOతో మారుతీ సుజుకి తర్వాత హ్యుందాయ్ మోటార్ ఇండియా గత 20 ఏళ్లలో ప్రజలకు షేర్లు ఆఫర్ చేస్తున్న మొదటి కార్ల తయారీ సంస్థగా అవతరించనుంది.