News July 31, 2024
ITR దాఖలుకు నేడే చివరి తేదీ.. మిస్సయితే రూ.5వేలు ఫైన్

ఎలాంటి ఫైన్ లేకుండా ITR(FY24) దాఖలు చేయడానికి నేటితో గడువు ముగియనుంది. మళ్లీ పొడిగించేది లేదని ఐటీ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. అపరాధ రుసుముతో డిసెంబర్ 31 వరకు రిటర్నులు ఫైల్ చేయొచ్చు. వార్షిక ఆదాయం రూ.5లక్షల కంటే ఎక్కువ ఉంటే రూ.5వేలు, పన్ను వర్తించే ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే రూ.వెయ్యి ఫైన్ కట్టాలి. అలాగే పన్ను మొత్తంపై వడ్డీ కూడా చెల్లించాలి. కాగా నిన్నటి వరకు 6 కోట్ల మంది ITR దాఖలు చేశారు.
Similar News
News December 17, 2025
సంక్రాంతికి మరో 16 స్పెషల్ ట్రైన్స్

సంక్రాంతి పండగకు ఊరెళ్లే వారి కోసం దక్షిణమధ్య రైల్వే సర్వీసులు పెంచుతోంది. తాజాగా మరో 16 ట్రైన్స్ అనౌన్స్ చేసింది. సికింద్రాబాద్-శ్రీకాకుళం, వికారాబాద్-శ్రీకాకుళం, శ్రీకాకుళం-సికింద్రాబాద్ మార్గాల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. జనవరి 9 నుంచి 18 మధ్య ఈ ట్రైన్ సర్వీసులు అందుబాటులో ఉండనున్నట్లు ద.మ. రైల్వే తెలిపింది. రైళ్ల పూర్తి సమాచారం కోసం ఇమేజ్ స్లైడ్ చేయండి.
News December 17, 2025
ఆముదంతో చర్మం, గోళ్ల సంరక్షణ

చర్మం ముడతలు పడకుండా చేసే గుణాలు ఆముదంలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘చమురు రాసుకుని స్నానం చేస్తే చర్మం తాజాగా కనిపిస్తుంది. ఆముదంతో రోజూ 10ని. గోళ్లకు మర్దన చేసుకుంటే అవి దృఢంగా మారి విరగకుండా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు, నిద్ర లేచాక చమురు రాసుకుంటే పెదవులు కోమలంగా ఉంటాయి’ అని చెబుతున్నారు. అయితే గర్భిణులు, పాలిచ్చే తల్లులు దీనికి దూరంగా ఉంటే మంచిందంటున్నారు.
News December 17, 2025
జనవరి 1న ‘భారత్ టాక్సీ’ ప్రారంభం

ప్రయాణికులకు, డ్రైవర్లకు భారీ ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం ‘భారత్ టాక్సీ’ యాప్ను జనవరి 1 నుంచి ప్రారంభించనుంది. ఉబర్, ఓలా వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు దీటుగా దీనిని తీసుకొస్తోంది. తొలుత ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ప్రారంభించి తరువాత దేశవ్యాప్తంగా విస్తరించనుంది. ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల తరహాలో ఇందులో అధిక ఛార్జీలు ఉండవు. ఇప్పటికే 56 వేల మందికిపైగా డ్రైవర్లు రిజిస్టర్ చేసుకున్నట్లు సమాచారం.


