News July 31, 2024

ITR దాఖలుకు నేడే చివరి తేదీ.. మిస్సయితే రూ.5వేలు ఫైన్

image

ఎలాంటి ఫైన్ లేకుండా ITR(FY24) దాఖలు చేయడానికి నేటితో గడువు ముగియనుంది. మళ్లీ పొడిగించేది లేదని ఐటీ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. అపరాధ రుసుముతో డిసెంబర్ 31 వరకు రిటర్నులు ఫైల్ చేయొచ్చు. వార్షిక ఆదాయం రూ.5లక్షల కంటే ఎక్కువ ఉంటే రూ.5వేలు, పన్ను వర్తించే ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే రూ.వెయ్యి ఫైన్ కట్టాలి. అలాగే పన్ను మొత్తంపై వడ్డీ కూడా చెల్లించాలి. కాగా నిన్నటి వరకు 6 కోట్ల మంది ITR దాఖలు చేశారు.

Similar News

News January 24, 2026

ఐఫోన్ 18 ప్రో వివరాలు లీక్.. ధర ఎంతంటే?

image

iPhone 18 ప్రో సిరీస్‌కు సంబంధించిన కీలక వివరాలు లీక్ అయ్యాయి. ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ డైనమిక్ ఐలాండ్‌తో కాకుండా అండర్‌ డిస్‌ప్లే ఏరియాతో రానున్నట్లు సమాచారం. కొత్తగా 2nm టెక్నాలజీతో తయారైన A20 ప్రో చిప్‌తో పాటు కెమెరాలో మెకానికల్ ఐరిస్‌ వంటి ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది. భారత్‌లో ఈ ఏడాది సెప్టెంబరులో లాంచ్‌ కావొచ్చు. ధర విషయానికి వస్తే 18 ప్రో రూ.1,34,900, ప్రో మ్యాక్స్ రూ.1,49,900గా ఉండొచ్చు.

News January 24, 2026

468రోజుల తర్వాత సూర్యకుమార్ హాఫ్ సెంచరీ

image

భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ రెండో T20లో పరుగుల వరద పారించారు. 23 ఇన్నింగ్సుల(468 రోజులు) సుధీర్ఘ ఎదురు చూపులకు హాఫ్ సెంచరీతో చెక్ పెట్టారు. అది కూడా 23 బంతుల్లోనే పూర్తి చేయడం విశేషం. T20WC నేపథ్యంలో తన ఫామ్‌పై వస్తున్న అనుమానాలను ఈ ఇన్నింగ్స్‌తో పటాపంచలు చేశారు. అలాగే సూర్య భారత్ తరఫున అత్యధిక T20I మ్యాచులు(126) ఆడిన లిస్ట్‌లో కోహ్లీ(125)ని దాటేశారు. రోహిత్(159) తొలిస్థానంలో ఉన్నారు.

News January 24, 2026

జనవరి 24: చరిత్రలో ఈరోజు

image

1757: బొబ్బిలి యుద్ధం ప్రారంభం
1950: జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా స్వీకరించిన భారత ప్రభుత్వం
1966: భారత ప్రధానిగా ఇందిరా గాంధీ(ఫొటోలో) బాధ్యతలు స్వీకరణ
1966: అణు శాస్త్రవేత్త హోమీ జహంగీర్‌ బాబా మరణం
1981: సినిమా నటి కాంచనమాల మరణం
* జాతీయ బాలికా దినోత్సవం