News March 31, 2024

స్కాలర్‌షిప్ దరఖాస్తుకు నేడు చివరి తేదీ

image

TG: SC, ST, BC, PWD విద్యార్థుల ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. 5-10 తరగతులు చదువుతోన్న వారు 2024-25 విద్యాసంవత్సరానికి రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినందున మరో ఛాన్స్ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. స్కాలర్‌షిప్ రెన్యువల్ చేసుకోవాల్సిన వారికీ ఇదే చివరి అవకాశం.
రిజిస్ట్రేషన్, రెన్యువల్ కోసం వెబ్‌సైట్: https://telanganaepass.cgg.gov.in/

Similar News

News February 6, 2026

T20 WC నుంచి హర్షిత్ రాణా ఔట్?

image

టీ20 వరల్డ్ కప్‌కు ముందు టీమ్ ఇండియాకు షాక్ తగిలే అవకాశం ఉంది. మోకాలి గాయం కారణంగా బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా టోర్నీకి దూరం అయ్యే అవకాశాలున్నాయని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్‌లో హర్షిత్ గాయపడ్డట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ స్పందించాల్సి ఉంది. హర్షిత్ స్థానంలో పేసర్ సిరాజ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

News February 6, 2026

సంపూర్ణ ఆహారం గొర్రెల పెరుగుదలకు ముఖ్యం

image

గొర్రెలకు మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు, విటమిన్లతో కూడిన సంపూర్ణ దాణా(ఆహారం) అందేలా జాగ్రత్త వహించాలి. అప్పుడే గొర్రె మందలు ఆరోగ్యంగా పెరుగుతాయి. మంచి దాణా వల్ల గొర్రెల్లో పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి వాటి మందలు వృద్ధిచెంది, పెంపకందారులకు అధిక ఆదాయం అందిస్తాయి. సరైన పోషకాహారం అందని తల్లి గొర్రెల వద్ద పిల్లలకు సరిపోను పాలుండకపోతే పిల్లలు సరిగా ఎదగక మరణిస్తాయి.

News February 6, 2026

పురుషాంగం సైజు పెంచుకుంటున్నట్లు ప్లేయర్లపై ఆరోపణలు

image

వింటర్ ఒలింపిక్స్ కోసం కొందరు స్కీ జంపర్స్ పురుషాంగం సైజు పెంచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. స్కీయర్స్‌కు శరీరం తాకి ఉండే టైట్ సూట్స్ కుట్టేందుకు 3D బాడీ స్కాన్ చేస్తారు. కొంచెం గ్యాప్ ఉన్నా గాలి చేరి తేలికై ఎక్కువ జంప్ చేయొచ్చు. దీంతో పెద్ద సూట్‌కై కొందరు ప్లేయర్స్ ఇంజెక్షన్లతో తాత్కాలికంగా సైజు పెంచుతున్నారని జర్మన్ మీడియా ఆరోపణ.