News February 28, 2025
కుల గణన రీసర్వేకు నేడే లాస్ట్.. మంత్రి విజ్ఞప్తి

తెలంగాణ జనాభా లెక్కల్లో మీ భాగస్వామ్యం ఉండాలంటే కులగణన సర్వేలో పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. రీసర్వే గడువు నేటితో ముగుస్తుందని చెప్పారు. టోల్ ఫ్రీ నంబర్ 040-21111111కు కాల్ చేస్తే ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేస్తారని తెలిపారు. ఎంపీడీవో, వార్డు ఆఫీసులతో పాటు seeepcsurvey.cgg.gov.in ద్వారా కూడా సమాచారాన్ని ఇవ్వొచ్చని వివరించారు.
Similar News
News March 18, 2025
విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు

AP: కాకినాడ పోర్టు షేర్ల బదలాయింపు వ్యవహారంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీఐడీ రెండోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 25న విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఈ నెల 12న ఆయన తొలిసారి విచారణకు హాజరయ్యారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
News March 18, 2025
క్రిమినల్ కేసుల్లో టీడీపీ ఎమ్మెల్యేలదే అగ్రస్థానం: ADR

దేశంలో క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేల జాబితాలో టీడీపీ అగ్రస్థానంలో ఉన్నట్లు ADR నివేదిక వెల్లడించింది. 134 మందికిగాను 115 మంది(86%)పై క్రిమినల్ కేసులు, 82 మంది(61%)పై తీవ్రమైన కేసులు ఉన్నట్లు తెలిపింది. ఇక 1,653 మంది బీజేపీ ఎమ్మెల్యేలకుగాను 638 మంది(39%)పై కేసులు ఉన్నట్లు పేర్కొంది. 52 శాతం మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల(339/646)పై, 41% TMC(95/230) ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు ఉన్నాయంది.
News March 18, 2025
‘దమ్ముంటే పట్టుకోరా’.. ఇన్విజిలేటర్‌కు సవాల్

AP: రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు జరుగుతున్న వేళ ఓ పరీక్షా కేంద్రం వద్ద రాసిన రాతలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. శ్రీకాకుళం (D) టెక్కలిలోని ఓ ఎగ్జామ్ సెంటర్ గోడపై ‘దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు.. పట్టుకుంటే వదిలేస్తా బుక్ లెట్’ అనే రాతలు కనిపించాయి. దీన్ని చూసిన ఇన్విజిలేటర్లు మండిపడ్డారు. ఇది ఆకతాయిల పనే అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ పిచ్చిరాతలపై మీ COMMENT.