News September 27, 2024

నేడే చివరి టెస్ట్.. క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను

image

భారత్-బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా ఇవాళ ఉదయం 9.30 గంటలకు చివరిదైన రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమ్ ఇండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ క్లీన్‌స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. జోరు మీదున్న భారత్‌పై నెగ్గడం బంగ్లాకు కఠినమైన సవాలే. ఇక తొలి టెస్టులో పంత్, గిల్, అశ్విన్ సెంచరీలతో అదరగొట్టగా ఈ మ్యాచ్‌లో స్టార్లు రోహిత్, కోహ్లీ రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Similar News

News October 9, 2024

టీడీపీలో చేరిన మాజీ ఎంపీలు

image

AP: మాజీ ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి వీరిద్దరూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

News October 9, 2024

ఉమెన్స్ WC: బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

image

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

IND: షఫాలీ, మంధాన, జెమిమా, హర్మన్‌(C), రిచా, దీప్తి, సాజన, అరుంధతి, శ్రేయాంక, శోభన, రేణుక.

SL: విష్మీ గుణరత్నే, చమరి ఆటపట్టు(C), హర్షిత, కవిష, నీలాక్షి, అనుష్క, కాంచన, సుగంధిక, ఇనోషి, ఉదేషికా, ఇనోక.

News October 9, 2024

రతన్ టాటా ఆరోగ్యం విషమం?

image

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా(86) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్నారని, వైద్యులు చికిత్స అందిస్తున్నారని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. తన ఆరోగ్యం బాగుందంటూ టాటా 2 రోజుల క్రితమే స్పష్టతనిచ్చారు. కేవలం రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకుంటున్నానని, అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ అవే వార్తలు రావడం గమనార్హం.