News December 6, 2024
ఇవాళ SDRF ప్రారంభం

TG: ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. దీంతో పాటు SDRF వాహనాలు, బోట్లనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. 2 వేల మంది సిబ్బందితో ఏర్పాటయ్యే SDRF విపత్తుల సమయంలో బాధితుల రక్షణ కోసం సేవలు అందించనుంది. దీని నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.35.03 కోట్లను మంజూరు చేసింది.
Similar News
News January 16, 2026
రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్.. వీటిలో పుష్కలం

మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాల్లో విటమిన్-C ఒకటి. రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడానికి, గాయాలు త్వరగా మానడానికి ఇది కీలకమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉసిరికాయ, జామకాయ, నారింజ, బత్తాయి, ద్రాక్ష, బొప్పాయి, స్ట్రాబెర్రీలు, కివీ వంటి పండ్లలో ఇది పుష్కలంగా లభిస్తుంది. కూరగాయల్లో టమోటాలు, ఆకుకూరలు, క్యాప్సికమ్, మునగాకులో ఎక్కువగా ఉంటుంది.
News January 16, 2026
RGNIYDలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్ (<
News January 16, 2026
ఆవులకు దిష్టి తీయడం మరవకండి

భోగి నాడు చిన్నారులపై భోగి పళ్లు పోసి దిష్టి తీసినట్లుగానే, కనుమ నాడు పాడి పశువులకు దిష్టి తీయాలని పండితులు సూచిస్తున్నారు. వాటిపై చెడు ప్రభావం పడకూడదన్నా, ఆయుష్షు పెరగాలన్నా రైతన్నలు ఈ ఆచారం పాటించాలంటున్నారు. పసుపు, కుంకుమలు కలిపిన నీటితో, హారతితో పశువులకు దిష్టి తీయాలి. అవి లక్ష్మీ స్వరూపంతో సమానం. ఇలా చేస్తే పశుసంపద సంక్షేమంగా ఉండి, రైతు ఇల్లు పాడి పంటలతో కళకళలాడుతుందని పండితులు చెబుతున్నారు.


