News May 27, 2024
నేడు రేవ్ పార్టీ కేసు నిందితుల విచారణ

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమతో సహా 8 మందిని సీబీఐ నేడు విచారించనుంది. ఈనెల 27న విచారణకు రావాలంటూ వారికి సీబీఐ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టై, జుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు నేడు కోర్టులో పిటిషన్ వేయనున్నారు. కాగా రేవ్ పార్టీలో 103 మంది పాల్గొనగా, 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందని పోలీసులు ఇప్పటికే వెల్లడించారు.
Similar News
News February 14, 2025
వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్

AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాసేపట్లో ఆయనను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. నిన్న ఉదయం ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు 8 గంటల పాటు విచారించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు హాజరుపరిచారు. దాదాపు 2 గంటలపాటు వాదనలు జరిగాయి. A1 వంశీతో పాటు A7 శివరామకృష్ణ, A8 లక్ష్మీపతికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
News February 14, 2025
వంశీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

AP: వల్లభనేని <<15453734>>వంశీకి<<>> నేర చరిత్ర ఉందని, అతనిపై ఇప్పటివరకు 16 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసును విత్ డ్రా చేసుకోవాలని వంశీ, అతని అనుచరులు సత్యవర్ధన్‌ను బెదిరించారని తెలిపారు. సత్యవర్ధన్ సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. వంశీకి బెయిల్ ఇవ్వొద్దని, రిమాండ్ విధించాలని కోరారు. ఈ కేసులో మరికొంత మంది నిందితులు దొరకాల్సి ఉందన్నారు.
News February 14, 2025
రెసిప్రోకల్ సుంకాలను వసూలు చేస్తాం: ట్రంప్

ఇతర దేశాల నుంచి రెసిప్రోకల్ (పరస్పర) సుంకాలను వసూలు చేయాలని నిర్ణయించినట్లు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. US నుంచి ఆయా దేశాలు ఎంత వసూలు చేస్తే తామూ అంతే వసూలు చేస్తామని వెల్లడించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఎక్కువ టారిఫ్స్ వసూలు చేస్తోందని తెలిపారు. తాము కూడా భారత్ నుంచి అంతే వసూలు చేస్తున్నామని చెప్పారు.