News March 29, 2024

ఈరోజు నాకు చాలా ప్రత్యేకం: అల్లు అర్జున్

image

దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ స్టేడియంలో నిన్న సాయంత్రం అల్లు అర్జున్ తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బన్నీ ట్విటర్‌లో స్పందించారు. ‘ఈరోజు చాలా ప్రత్యేకం. నా తొలి సినిమా గంగోత్రి 2003లో ఈరోజే విడుదలైంది. ఈరోజు టుస్సాడ్స్‌లో నా విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నా. ఈ 21ఏళ్ల ప్రయాణం మర్చిపోలేనిది. దీనిలో నాకు అండగా నిలిచిన వారికి, నా ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.

Similar News

News October 21, 2025

పాక్ ODI కెప్టెన్‌గా రిజ్వాన్ తొలగింపు.. కారణం ఇదేనా?

image

పాక్ ODI కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్‌ స్థానంలో షహీన్ అఫ్రీదిని నియమించిన సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడానికి నిరాకరించినందుకే రిజ్వాన్‌ను తొలగించినట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో అతడు బెట్టింగ్ యాప్స్ లోగో ఉన్న జెర్సీని ధరించడానికి ఒప్పుకోలేదు. మరోవైపు పాలస్తీనా మద్దతుగా చేసిన వ్యాఖ్యలూ ప్రభావం చూపాయని సమాచారం.

News October 21, 2025

విశాఖకు గూగుల్ రావడం జగన్‌కు ఇష్టం లేదనిపిస్తోంది: మాధవ్

image

AP: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును స్వాగతిస్తూ YS జగన్‌ కనీసం ట్వీట్ కూడా చేయలేదని BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆక్షేపించారు. గూగుల్ పెట్టుబడులు రావడం ఆయనకు ఇష్టం లేదనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దీనిద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తుంటే ఎందుకు స్వాగతించడం లేదో సమాధానం చెప్పాలన్నారు. యువతకు మంచి అవకాశాలు రాబోతున్నాయని, డబుల్ ఇంజిన్ సర్కారు ఫలితాలు రుచిచూపిస్తున్నామని చెప్పారు.

News October 21, 2025

శ్రీశైలంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు

image

AP: శ్రీశైలంలో రేపటి నుంచి నవంబర్ 21 వరకు కార్తీక మాసోత్సవాలు జరుగుతాయని EO తెలిపారు. కార్తీకమాసంలో గర్భాలయ, సామూహిక అభిషేకాలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. రోజూ విడతల వారీగా మల్లికార్జునస్వామి స్పర్శదర్శనం ఉంటుందని, శని, ఆది, సోమవారాల్లో కుంకుమార్చనలు నిలిపివేస్తామని వెల్లడించారు. హోమాలు, కళ్యాణాలు యథావిధిగా నిర్వహిస్తామన్నారు. అటు పుణ్యక్షేత్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.