News March 29, 2024
ఈరోజు నాకు చాలా ప్రత్యేకం: అల్లు అర్జున్

దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ స్టేడియంలో నిన్న సాయంత్రం అల్లు అర్జున్ తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బన్నీ ట్విటర్‌లో స్పందించారు. ‘ఈరోజు చాలా ప్రత్యేకం. నా తొలి సినిమా గంగోత్రి 2003లో ఈరోజే విడుదలైంది. ఈరోజు టుస్సాడ్స్‌లో నా విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నా. ఈ 21ఏళ్ల ప్రయాణం మర్చిపోలేనిది. దీనిలో నాకు అండగా నిలిచిన వారికి, నా ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.
Similar News
News February 11, 2026
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 34 పోస్టులకు నోటిఫికేషన్

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(CEL) 34 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech, PhD, MBA/PGP/PGDM, LLB, CA/CMA, టెన్త్, డిగ్రీ, పీజీ అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 3వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1,000, SC, ST, PwBDలకు ఫీజు లేదు. రాత పరీక్ష, DV, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.celindia.co.in
News February 11, 2026
అభిషేక్ రేపు ఆడతారా.. తిలక్ ఏమన్నారంటే?

T20WC: కడుపు సంబంధిత సమస్యతో బాధపడుతున్న అభిషేక్ రేపు నమీబియాతో జరిగే మ్యాచ్‌లో ఆడతారా? లేదా? అన్న సందేహం నెలకొంది. దీనిపై తిలక్ మాట్లాడుతూ.. అభిషేక్ ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని చెప్పారు. రేపు మ్యాచ్ టైమ్‌కు అతని ఫిట్‌నెస్‌ను బట్టి ప్లేయింగ్ 11లోకి తీసుకోవడంపై నిర్ణయం ఉంటుందన్నారు. మరోవైపు అభిషేక్ గైర్హాజరైతే అతని స్థానంలో సంజూ జట్టులోకి వస్తారని క్రీడావర్గాలు చెబుతున్నాయి.
News February 11, 2026
బాలింతలు ఏం తినాలంటే?

ఒక మహిళ జీవితంలో ఎక్కువ కెలోరీలు అవసరమయ్యేది బాలింత దశలోనే. బిడ్డకు పాలివ్వడం వల్ల ఆకలి ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ సమయంలో సమతులాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా టిఫిన్, లంచ్, డిన్నర్ మధ్యలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఫ్రూటస్, నట్స్ తీసుకోవాలి. మిల్లెట్స్ జావలు, సూప్స్, చికెన్, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వులు, చక్కెర, ఉప్పులున్న ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి.


