News July 25, 2024

నేడు ప్రపంచ IVF దినోత్సవం

image

సంతానోత్పత్తిలో సాధించిన పురోగతిని గుర్తించేందుకు ఏటా జులై 25న ప్రపంచ IVF దినోత్సవం జరుపుతారు. IVF ద్వారా తొలి శిశువు లూయిస్ బ్రౌన్ ఈ తేదీనే జన్మించింది. సహజంగా పిల్లలు కలగని వారు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్(IVF) ద్వారా పేరెంట్స్ అవుతుంటారు. ఈ పద్ధతికి ₹1-3 లక్షల వరకు ఖర్చవుతుంది. కేంద్రం 2021లో తీసుకొచ్చిన ART చట్టం ప్రకారం 21-45 ఏళ్ల వయసున్న వారు మాత్రమే ఇలా కృత్రిమ గర్భం పొందేందుకు అర్హులు.

Similar News

News October 12, 2024

హరిహర వీరమల్లుపై క్రేజీ అప్‌డేట్

image

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ గురించి అప్‌డేట్ వచ్చేసింది. త్వరలో ‘బ్యాటిల్ ఆఫ్ ధర్మ’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని నిర్మాత ఎ.ఎమ్ రత్నం విజయదశమి సందర్భంగా వెల్లడించారు. ఆ పాటను పవన్ కళ్యాణ్ పాడారని తెలిపారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 28న థియేటర్లలో విడుదల కానుంది.

News October 12, 2024

తప్పు ఎక్కడ జరిగింది?

image

తమిళనాడు కవరైపెట్టైలో ఆగి ఉన్న గూడ్స్ రైలును భాగమతి ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిన ఘటనలో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. రైలు మెయిన్ లైన్‌లో వెళ్లేలా సిగ్నల్ ఇవ్వగా, ట్రాక్ మాత్రం రైలును క్లోజ్డ్ లూప్ వైపు మళ్లించినట్లు దక్షిణ రైల్వే జీఎం ఆర్ఎన్ సింగ్ వెల్లడించారు. మెయిన్ లైన్‌పై వెళ్లాల్సిన రైలు ఎక్కడో తప్పు జరిగిన కారణంగా గూడ్స్ ఉన్న లైన్‌లోకి వెళ్లిందన్నారు. త్వరలోనే ఏం జరిగిందనేది ప్రకటిస్తామన్నారు.

News October 12, 2024

17న కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం

image

హ‌రియాణాలో BJP ప్ర‌భుత్వం Oct 17న కొలువుదీర‌నుంది. పంచ‌కుల‌లో జ‌రిగే కార్య‌క్ర‌మంలో నాయబ్ సింగ్ సైనీ మ‌రోసారి CMగా ప్ర‌మాణస్వీకారం చేయ‌నున్నారు. ఆయ‌న‌తోపాటు నూత‌న మంత్రివ‌ర్గ స‌భ్యులు కూడా ప్ర‌మాణం చేయనున్నారు. ప్ర‌ధాని మోదీ, BJP పాలిత రాష్ట్రాల CMలు కార్య‌క్ర‌మంలో పాల్గొంటార‌ని తెలుస్తోంది. కొత్త స‌భ్యుల‌కు ఈసారి మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యం ద‌క్క‌నున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.