News March 16, 2024
భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు నేటికి ఏడాది
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో నాటి కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత హోదాలో చేపట్టిన పాదయాత్రకు ఏడాది పూర్తయింది. గతేడాది మార్చి 16న ఆయన ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని పిప్పిరి గ్రామం నుంచి ఈ పాదయాత్రను చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ క్యాడర్ను కదిలించి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ఆయన చేపట్టిన యాత్ర 109 రోజులపాటు 1,364 కిలోమీటర్లు సాగింది.
Similar News
News October 12, 2024
ఖమ్మం: శ్రీలక్ష్మీ స్తంభాద్రి నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి
విజయ దశమి పండుగ సందర్భంగా ఖమ్మం నగరంలోని శ్రీ లక్ష్మీ స్తంభాద్రి నరసింహస్వామి దేవస్థానంలో శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ పండితులు, అధికారులు ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలకగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వేదపండితులు ఆశీర్వచనం, స్వామివారి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కమర్తపు మురళీ, గిడ్డంగుల ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు ఉన్నారు.
News October 12, 2024
ఖమ్మం: ముగ్గురిపై కేసు నమోదు: సీఐ
మహిళకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలు.. జిల్లా ఆస్పత్రి MCHలో ఓ మహిళా ఉద్యోగికి సహోద్యోగి సురేశ్ మద్యం తాగి ఫోన్ చేశాడు. ఆస్పత్రిలో సిబ్బంది శ్రీకాంత్, సత్యకుమార్కు ఆమెతో వివాహేతర సంబంధం ఉందని చెప్పారని, తనతోనూ ఏకాంతంగా గడపాలంటూ అసభ్యకరంగా మాట్లాడాడు. బాధితురాలు షీటీమ్స్ను ఆశ్రయించగా విచారణ అనంతరం ఆ ముగ్గురిపై కేసు నమోదైంది.
News October 12, 2024
KMM: దసరా.. మీ VILLAGE స్పెషల్ ఏంటి?
దసరా పండుగ అనగానే పల్లె యాదికొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, దోస్తులను కలిసి ఊరంతా తిరగడం బాగుంటుంది. ‘ఎప్పుడొచ్చినవ్.. అంతా మంచిదేనా’ అంటూ తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఊరిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్ల విభిన్నంగానూ చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.