News July 25, 2024

నేడు అసెంబ్లీకి గులాబీ దళపతి

image

TG: BRS అధినేత, మాజీ CM కేసీఆర్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నేడు అసెంబ్లీకి రానున్నారు. గాయం కారణంగా గత సమావేశాలకు గైర్హాజరయ్యారు. కాగా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభకు వచ్చి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం పలుమార్లు చెప్పింది. అటు తమ బాస్ సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే చూడాలని BRS అభిమానులూ వేచి చూస్తున్నారు. మొత్తానికి ఈరోజు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఆసక్తికరంగా సాగనున్నాయి.

Similar News

News January 28, 2025

టెన్త్ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్

image

AP: పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సెలవుల్లోనూ వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10 వరకు విద్యార్థులకు భోజనం అందించాలని విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10 వరకు రెండు రెండో శనివారాలు, ఆరు ఆదివారాలు ఉన్నాయి. ఆ రోజుల్లో విద్యార్థులకు భోజనం అందించాలని ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి.

News January 28, 2025

BJPలోకి అంబటి రాయుడు?

image

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుుడు బీజేపీలో చేరతారని తెలుస్తోంది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఏబీవీపీ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఆ సదస్సులో ఆయన బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీ ఒక్కటేనని ఆకాశానికెత్తారు. అప్పటి నుంచి ఆయన కాషాయ పార్టీ గూటికి చేరతారని వార్తలు వస్తున్నాయి. కాగా రాయుడు గతంలో వైసీపీలో చేరారు. అనంతరం ఆ పార్టీని వీడి జనసేన పార్టీతో కనిపించారు.

News January 28, 2025

IND vs ENG: మనోళ్లు సిరీస్ పట్టేస్తారా?

image

భారత్, ఇంగ్లండ్‌ మధ్య ఇవాళ మూడో టీ20 జరగనుంది. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా 5 మ్యాచుల సిరీస్‌లో టీమ్ ఇండియా వరుస విజయాలతో దూసుకెళ్తూ ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని సూర్య సేన భావిస్తోంది. మరోవైపు ఇవాళ గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలని ఇంగ్లండ్ పట్టుదలతో ఉంది. ఈ మ్యాచులో టాస్ కీలకంగా మారనుంది.