News April 11, 2024
నేడు బస్సుయాత్రకు సీఎం విరామం

AP: నేడు సీఎం జగన్ బస్సుయాత్రకు విరామమిచ్చారు. రంజాన్ సందర్భంగా ఆయన యాత్రకు విరామం తీసుకున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్లలోనే సీఎం బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
Similar News
News December 16, 2025
ఏపీపీ పోస్టులకు ఇంటర్వ్యూలు ఎప్పుడంటే?

AP: 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబర్ 19 నుంచి 22 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. మంగళగిరిలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఛైర్మన్ రాజీవ్‌కుమార్ మీనా తెలిపారు.
News December 16, 2025
2026 మార్చిలోపు ATM, UPI నుంచి పీఎఫ్ విత్‌డ్రా: కేంద్ర మంత్రి

ATM, UPI నుంచి PF విత్‌డ్రా చేసుకునే అవకాశం మార్చి 2026లోపు అందుబాటులోకి తెస్తామని కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ‘కారణం చెప్పకుండానే 75% వరకు పీఎఫ్ తీసుకోవచ్చు. ఆ డబ్బు మీది. అందుకే విత్‌డ్రా చేసుకునేందుకు ఇప్పటివరకు ఉన్న కఠినమైన రూల్స్‌ను సులభతరం చేస్తున్నాం. పీఎఫ్ అకౌంట్‌కు బ్యాంక్ ఖాతా లింక్ చేసుకుంటే డెబిట్ కార్డుతో ATMలో విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంటుంది’ అని చెప్పారు.
News December 16, 2025
453 Asst Prof పోస్టుల భర్తీ కోసం సీఎంకు ఫైల్

TG: వర్సిటీల్లోని 453 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. ఇందుకు సంబంధించిన ఫైలును CM రేవంత్‌కు పంపింది. 12 వర్సిటీల్లో 1061 పోస్టులు ఖాళీ ఉండగా ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో కొన్ని భర్తీ అయ్యాయి. వాటిని మినహాయించి మిగతా ఖాళీలను భర్తీ చేయాలని అధికారులు నివేదించారు. సీఎం ఆమోదించిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని పేర్కొన్నారు. కాగా ఎక్కువ ఖాళీలు OUలోనే ఉన్నాయి.


