News April 11, 2024

నేడు బస్సుయాత్రకు సీఎం విరామం

image

AP: నేడు సీఎం జగన్ బస్సుయాత్రకు విరామమిచ్చారు. రంజాన్ సందర్భంగా ఆయన యాత్రకు విరామం తీసుకున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్లలోనే సీఎం బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

Similar News

News March 26, 2025

అప్సర హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు

image

TG: సంచలనం రేపిన <<10880696>>అప్సర<<>> హత్య కేసులో రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఆమెను హత్య చేసిన నిందితుడు పూజారి సాయికృష్ణకు జీవితఖైదు విధించింది. కొన్నేళ్లుగా అప్సర అనే మహిళతో వివాహేతర సంబంధం నడిపిన సాయికృష్ణ 2023లో ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మ్యాన్‌హోల్‌లో పడేసి, అప్సర కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడిపై అనుమానం రావడంతో దర్యాప్తు చేపట్టగా సాయికృష్ణే నిందితుడని తేలింది.

News March 26, 2025

రామ్ చరణ్ అభిమానులకు సూపర్ న్యూస్

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ‘RC16’ సినిమా నుంచి అప్డేట్ రానుంది. ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు అప్డేట్ ఇస్తామని మేకర్స్ ప్రకటించారు. రేపు చరణ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ వీడియో వచ్చే అవకాశం ఉన్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News March 26, 2025

వాషింగ్టన్ సుందర్‌పై స్పందించిన గూగుల్ సీఈఓ

image

వాషింగ్టన్ సుందర్‌‌ను గుజరాత్ టైటాన్స్ తుది జట్టులోకి తీసుకోకపోవడంపై గూగుల్ CEO సుందర్ పిచాయ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇండియా టీమ్‌లో ఉన్న సభ్యుడికి IPL తుది జట్టులో చోటు కల్పించరా అని ఒక అభిమాని Xలో పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన సుందర్ పిచాయ్ నాకూ అదే ఆశ్చర్యంగా ఉందని రిప్లై ఇచ్చారు. GT-PBKS మధ్య జరిగిన మ్యాచులో పంజాబ్ జట్టు 243పరుగుల లక్ష్యాన్నినిర్దేశించగా GT స్వల్ప తేడాతో ఓడిపోయింది.

error: Content is protected !!