News November 9, 2024
నేడు మహారాష్ట్రకు సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ రెడ్డి నేడు మహారాష్ట్రకు వెళ్లనున్నారు. ఉ.8 గంటలకు శంషాబాద్ నుంచి ముంబైకి వెళ్తారు. అక్కడ కాంగ్రెస్ సీఎంల సమావేశంలో పాల్గొంటారు. మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికల మ్యానిఫెస్టోపై సలహాలు వంటి పలు విషయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఎన్నికల్లో రేవంత్ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు.
Similar News
News December 8, 2024
ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోండి: సీఎం చంద్రబాబు
AP: భారీ వర్షాలతో ధాన్యం తడవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, జేసీలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కోత కోసిన వరిని వెంటనే సమీపంలోని రైస్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. కోత కోసిన వరిని రక్షించేందుకు టార్పాలిన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అటు వర్షాలు పడే సమయంలో పంట కోత కోయకుండా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.
News December 8, 2024
రాముడే సిగ్గుతో తలదించుకుంటాడు: ఇల్తిజా
రాముడి పేరు నినదించలేదన్న కారణంతో ముస్లిం యువకులను హింసించడం లాంటి ఘటనలతో రాముడే సిగ్గుతో తలదించుకుంటాడని PDP నాయకురాలు ఇల్తిజా ముఫ్తీ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనపై ఆమె స్పందిస్తూ ఇలాంటి సమయాల్లో రాముడు సైతం నిస్సహాయంగా ఉండిపోతారని పేర్కొన్నారు. దేవుడి పేరును చెడగొడుతూ లక్షలాది మంది భారతీయులను పట్టిపీడిస్తున్న రోగం హిందుత్వమని అన్నారు.
News December 8, 2024
భారీ వర్షాలు.. రైతులకు హెచ్చరిక
AP: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేసింది. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కోతకి సిద్ధంగా ఉన్న వరి పంటను వర్షాలకు ముందు కోయరాదని తెలిపింది. కోసినా పూర్తిగా ఆరని వాటిని కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పవేస్తే నష్ట శాతం నివారించవచ్చంది.