News August 9, 2024
ఇవాళ భారీగా పెరిగిన బంగారం ధరలు

గత వారం రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.820 పెరిగి రూ.70,090కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.750 పెరిగి రూ.64,250 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,500 పెరిగింది. ప్రస్తుతం వెండి రేటు కేజీ రూ.88,000గా ఉంది.
Similar News
News July 9, 2025
ఇవాళ భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం

TG: రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, కామారెడ్డి, MBNR జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పూర్తి లిస్ట్ కోసం <
News July 9, 2025
ఆధార్ తొలి గుర్తింపు కాదు: భువనేశ్

బిహార్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో నకిలీ ఓట్లను గుర్తించేందుకు ఆధార్‌ను అనుసంధానించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. కాగా ఆధార్ కేవలం ఒక ధ్రువీకరణ మాత్రమేనని, అర్హతకు ప్రాథమిక ఆధారం లేదా గుర్తింపు కాదని UIDAI CEO భువనేశ్ కుమార్ స్పష్టం చేశారు. అటు ఫేక్ ఆధార్ కార్డుల కట్టడికీ మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలిపారు. నకిలీ ఆధార్‌లను గుర్తించే QR కోడ్ స్కానర్ యాప్ అభివృద్ధి చివరి దశలో ఉందన్నారు.
News July 9, 2025
సామ్‌తో రాజ్.. శ్యామలి ఇంట్రెస్టింగ్ పోస్ట్

హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారనే పుకార్ల వేళ వీరిద్దరూ కలిసి ఉన్న <<17000941>>ఫొటో<<>> వైరలైన విషయం తెలిసిందే. ఈక్రమంలో రాజ్ సతీమణి శ్యామలి ఇన్‌స్టా స్టోరీలో ఆసక్తికర సందేశాన్ని పంచుకున్నారు. ‘ఏ మతమైనా మన చర్యలతో ఇతరులను బాధించొద్దని చెబుతుంది. అదే మనం పాటించాల్సిన గొప్ప నియమం’ అని రాసున్న కొటేషన్‌ను ఆమె పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ చర్చనీయాంశమైంది.