News March 17, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు!

image

*ఏర్పాట్లు పూర్తి..రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం
*WNPT:విద్యుదాఘాతంతో ఒకరి మృతి
*ఉమ్మడి పాలమూరు నుంచి ముగ్గురికి కార్పొరేషన్ పదవులు
*కవిత అరెస్టుకు నిరసనగా ఉమ్మడి జిల్లాలో ‘BRS’ నేతల ధర్నా
*టెన్త్ ‘విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుంటే చర్యలు’:DEOలు
*NGKL:రెండు బైకులు ఢీ..ఒకరు మృతి
*బీజేపీ గెలుపులో యువత కీలకపాత్ర పోషించాలి:డీకే అరుణ
*MBNR,దేవరకద్రలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

Similar News

News March 15, 2026

బీసీ సబ్ ప్లాన్‌ను అమలు చేయాలి: మాజీ మంత్రి

image

హైదరాబాద్ లక్డికపూల్‌లోని సెంట్రల్ కోర్ట్ హోటల్‌లో నిర్వహించిన బీసీ సంఘాలు- ప్రజాప్రతినిధుల సమావేశంలో మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగాలు, కాంట్రాక్ట్‌లలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు.

News March 15, 2026

MBNR: మొబైల్ లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం

image

తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలో న్యాయ సేవలను మరింత విస్తరించేందుకు 2 మొబైల్ లోక్ అదాలత్ వాహనాలను కొనుగోలు చేసింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత మాట్లాడుతూ.. ఈ వ్యాన్లు ప్రతినెల రోటేషన్ పద్ధతిలో జిల్లాలకు పంపి లిటరసీ క్యాంపులు, లీగల్ సర్వీసెస్ జైలు సందర్శనలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

News March 14, 2026

సీసీకుంట: “వెయ్యేళ్ల కురుమూర్తి కొండలను కాపాడండి”

image

చిన్న చింతకుంట మండలం అమ్మపురం గ్రామంలో క్రషర్ మైనింగ్‌కు అనుమతి ఇవ్వవద్దని స్థానిక రైతులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయం పరిసర ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలు జరిగితే పర్యావరణానికి, వ్యవసాయానికి, భక్తుల భావాలకు నష్టం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మైనింగ్ అనుమతులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.