News May 21, 2024
ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు

* హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కన్నుమూత
* MLC కవితకు జూన్ 3 వరకు కస్టడీ పొడిగింపు
* ఏపీ అల్లర్లపై నివేదిక సమర్పించిన సిట్
* సన్న వడ్లకే రూ.500 బోనస్: మంత్రి పొంగులేటి
* ఎల్లుండి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల బంద్‌కు ప్రకటన
* వైసీపీకి ఘోర ఓటమి తప్పదు: ప్రశాంత్ కిశోర్
* ముగిసిన TG కేబినెట్ భేటీ.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి సోనియాను ఆహ్వానించాలని నిర్ణయం.
Similar News
News July 8, 2025
ప్రశాంతిపై ప్రసన్న అనుచిత వ్యాఖ్యలు చేయలేదు: అనిల్

AP: క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలపై విచారణ జరిపితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డే జైలుకు వెళ్లాల్సి వస్తుందని వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. టీడీపీ నేతల అక్రమ కేసులకు వైసీపీ నేతలు భయపడరని చెప్పారు. ‘ప్రశాంతిపై నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. ప్రసన్నను చంపేందుకే వేమిరెడ్డి అనుచరులు ఇంటికి వచ్చారు. ఆయన లేకపోవడంతో ఇంటిని ధ్వంసం చేశారు’ అని ఆయన ఆరోపించారు.
News July 8, 2025
కేటీఆర్ అడ్డగోలు మాటలు మానుకోవాలి: భట్టి

TG: సీఎం రేవంత్ సవాల్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే <<16989439>>కేటీఆర్<<>> జీర్ణించుకోలేకపోతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. కేటీఆర్ అడ్డగోలు మాటలు మానుకోవాలని ఫైరయ్యారు. భవిష్యత్తులో బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని విమర్శించారు. దమ్ముంటే అసెంబ్లీలో తేల్చుకుందామని, చర్చకు కేసీఆర్ రావాలని సవాల్ చేశారు. గోదావరి, కృష్ణ జలాలపై చర్చించేందుకు సిద్ధమన్నారు.
News July 8, 2025
విమాన లగేజీ రూల్స్‌పై చర్చ.. మీరేమంటారు?

విమానంలో ప్రయాణించే వారు తీసుకువెళ్లే లగేజీలపై ఆంక్షలు ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే, ఈ రూల్‌పై నెట్టింట విమర్శలొస్తున్నాయి. 100 కేజీలున్న ఓ వ్యక్తి 24kgల లగేజీని తీసుకెళ్తే ఓకే చెప్తారని, అదే 45kgలున్న మరో వ్యక్తి 26kgల లగేజీ తెస్తే అడ్డు చెప్తారని ఓ యువతి ట్వీట్ చేసింది. ఈ పోస్టుకు 24 గంటల్లోనే 85లక్షల వ్యూస్ లక్ష లైక్స్ వచ్చాయి. యువతి చెప్పిన విషయం కరెక్ట్ అని పలువురు మద్దతు తెలుపుతున్నారు.